మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సమాజ హితం కోసం నేత్రదానం చేసిన ఆదర్శమూర్తి వరలక్ష్మి అని పలువురు కొనియాడారుగత నెల 28న ప్రశాంత్ నగర్ లో నివసించే వరలక్ష్మి గారు హటాన్మరణం చెందగా నేత్ర దానం చేశారు.ఈ మేరకు ఈ రోజు వారి నివాసంలో సదాశయ ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి లింగమూర్తి ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నేత్ర, దాత కుటుంబ సభ్యులకు ముఖ్య అతిధి విచ్చేసిన ఏఐటియూసి అధ్యక్షులు కా "గట్టయ్య,చేతుల మీదుగా సదాశయ ఫౌండేషన్ అభినందన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్బంగా ఫౌండేషన్ ప్రతినిదులు లింగమూర్తి,రాజమౌళి, అన్నపూర్ణ మాట్లాడుతూ... వరలక్ష్మమ్మ మరణించినా మరో ఇద్దరికి కంటి చూపును ప్రసాదించి సజీవంగా ఉన్నారన్నారు.కూతుర్ల దైర్యం ను, పరోపకార బుద్దిని కొనియాడారు ప్రతీ ఒక్కరు నేత్ర, అవయవ, శరీర దానం చేయడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.నేత్ర అవయవ, దేహ దానలపై అవగాహనా కల్పించి నేత్ర దానం చేయాలనుకుంటే 9492781306 కు ఫోన్ చేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో నేత్ర, శరీరదాత కూతుళ్లు శ్రీదేవి, శాంతి, భారతిలు అల్లుండ్లు,బంధువులు,మిత్రులు ఏఐటీయూసీ కార్యకర్తలు రాజ రత్నంluపాల్గొన్నారు.నేత్ర ధాత కుటుంబ సభ్యులను సదాశయ అధ్యక్ష కార్యదర్శులు శ్రవణ్ కుమార్, సలహాదారులు నూక రమేష్,కే ఎస్ వాసు అధ్యక్షులు రాజమౌళి, సుధాకర్ రావు లయన్స్ క్లబ్ అధ్యక్షులు రాజేందర్లు ధన్యవాదములు తెలిపారు

Post A Comment: