మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
: దేశ రాజధాని ఢిల్లీలో మార్చి 11,12 న జరిగిన భారత్ బచావో జాతీయ సదస్సు లో సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ తన బృందంతో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం ప్రపంచంలో అత్యంత గొప్ప రాజ్యాంగమని అలాంటి రాజ్యాంగాన్ని ప్రస్తుత పాలకులు ఖునీ చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భారత రాజ్యాంగం సార్వసత్తాక , సార్వభౌమ సామ్యవాద ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యాంగమని తెలిపారు. పాలకులు కులంపేరుతో, మతం పేరుతో, పాసిజం పేరుతో ప్రజల్లో విద్వేషాలను నింపుతూ
దేశాన్ని నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. భారత రాజ్యాంగ స్ఫూర్తితో పాలన జరగాలని, రాజ్యాంగ రక్షణ కోసం, దేశాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలను చైతన్యం చేయడానికి భారత్ బచావో జాతీయ సదస్సును నిర్వహించిన డాక్టర్ గోపీనాథ్, గాదె ఇన్నయ్యలకు దన్యవాదములు తెలిపారు. దేశప్రజలంతా ఏకమై రాజ్యాంగాన్ని, దేశాన్ని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పాగే భూమయ్య, పాగే పార్వతమ్మ, బండారి శివకుమార్, వోరేం రవికుమార్, కొఠారి శ్రీనివాస్,జె వి రాజు, సానపురి శ్రీనివాస్, ఆవుల వేణు రామటేంకి మల్లేష్, జాడి ప్రవీణ్ తదితరులు ఉన్నారు.

Post A Comment: