మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీల సంక్షేమ అభివృద్ధి కోసమే కాకుండా వాళ్ళ హక్కుల పరిరక్షణకు ఎల్లప్పుడూ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా ఉంటుందని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు. శనివారం ఎన్టిపిసి లోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో ఆల్ మైనారిటీ ఉద్యోగుల సంక్షేమ సంఘం సర్వసభ్య సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మాట్లాడుతూ... మైనార్టీలు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు ఆదిల్ షరీఫ్ అధ్యక్షులు అహ్మద్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: