మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

Gdk1&3 ఇంక్లైన్ లో పిట్ కార్యదర్శి దాసరి సురేష్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది, ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు మాట్లాడుతూ, సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న మారుపేర్ల మార్పు, మైనింగ్ స్టాప్, టెక్నికల్ స్టాప్, ఆపరేటర్స్ మెడికల్ అన్ పిట్ అయితే సూటబుల్ జాబు ఇవ్వాలని, తదితర సమస్యలపై, ఐదు జాతీయ సంఘాలు గుర్తింపు సంఘంతో జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా ఎన్నికలు నిర్వహించడం అంటే కార్మికులను మరోసారి మోసం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధపడ్డదని తెలుస్తుందిని, ఇప్పటికైనా అన్ని కార్మిక సంఘాలకు కార్మికుల సమస్యలపై చిత్తశుద్ధి ఉంటే యజమాన్యంతో జరిగిన ఒప్పందాలను అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్ళమని తేల్చి చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు, నిరంతరం కార్మికుల సమస్యలపై పోరాడుతున్న సిఐటియు ఈ క్రింది సమస్యల పరిష్కారం కోసం, సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సీఐటీయూ, కార్మిక వ్యతిరేకమైన కోడ్ అప్ డిస్ప్లేన్ మార్చాలని, రెండు సంవత్సరాలకే ఎన్నికలు నిర్వహించాలని, రెండు ఓట్ల విధానం కావాలని, గతంలో కార్మిక సంఘాలతో చేసుకున్న ఒప్పందాలను తక్షణం అమలు చేయాలని, లేబర్ కమిషన్ ముందు ఉంచడం జరిగింది అన్నారు, ఈ కార్యక్రమంలో అర్జి1, ఉపాధ్యక్షులు ఆరేపల్లి రాజమౌళి, ఎస్కే గౌస్, అర్జి3, ఉపాధ్యక్షులు తోట నరహరి రావు, Gdk1&3 ఇంక్లైన్ పిట్ కార్యదర్శి దాసరి సురేష్, అసిస్టెంట్ పిట్ సెక్రటరీ సాయికృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీలు, కటు రమేష్, రాంనరసయ్య, సందీప్, కనకయ్య, వీ రాయమల్లు, శంకర్, ఇప్పలపల్లి సతీష్ కుమార్, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు,

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: