మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్  ఇటీవలి TSPSC పరీక్షా పత్రాల లీక్‌పై తీవ్ర నిరాశ మరియు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.  ఈ ఘటనను ఖండిస్తున్నామని, భద్రతా ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.సింగరేణిలో గతంలో నిర్వహించిన పరీక్షలపై అనేక అపోహలు వచ్చిన నేపథ్యంలో భవిష్యత్తులో నిర్వహించే అన్ని పరీక్షలను సింగరేణి యాజమాన్యం పకడ్బందీగా నిర్వహించాలని విడుదల చేసిన ప్రకటనలో INTUC సెక్రెటరీ జనరల్  జనక్ ప్రసాద్  యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. *ఇలాంటి సంఘటనలు పరీక్షా ప్రక్రియ విశ్వసనీయతను దెబ్బతీయడమే కాకుండా ఈ పరీక్షలకు అర్హత సాధించేందుకు కష్టపడి పనిచేసే అభ్యర్థుల కలలను కూడా దెబ్బతీస్తాయని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు సింగరేణి పునరావృతం కాకుండా చూసేందుకు సింగరేణిలో జరిగే అన్ని పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని యాజమాన్యాన్ని కోరారు అలాగే పరీక్ష నిర్వహణ తర్వాత OMR పత్రాన్ని అభ్యర్థులకు ఇచ్చేలా చూడాలని కోరారు .

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: