మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బి' థర్మల్ పవర్ హౌస్ మూసివేతకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కౌశిక హరి మరియు అప్పటి మంత్రి శ్రీధర్ బాబు అభ్యర్థన మేరకు 2013 లో అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంజూరు చేసినటువంటి ₹7960 కోట్లు రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత యాదాద్రి కి తరలిపోవడాన్ని నిరసిస్తూ తిరిగి మళ్లీ రామగుండంలో బి థర్మల్ పవర్ స్టేషన్ కు నిధులు మంజూరు చేసి 800×2 మెగావాట్ల విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఈనెల 20న రామగుండం అంబేద్కర్ చౌక్ లో మహా నిరసన దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టారు బిజెపి నేత కౌశిక హరి . ఈ యొక్క దీక్షకు రామగుండం పట్టణ మరియు పారిశ్రామిక ప్రాంత ప్రజలందరూ తరలివచ్చి పాల్గొనాలని కరపత్రాన్ని ఆవిష్కరించి రామగుండం పట్టణ వ్యాపారస్తులకు అందజేసి ఈ సందర్భంగా రమ్మని కోరారు. ఈ కార్యక్రమంలో నిమ్మరాజుల రవి దారంగుల కుమార్ కుక్క గంగ ప్రసాద్ మోసం పృథ్వీరాజ్ రాజశేఖర్ ఆత్మ లింగం నాగరాజ్ సురేష్ తిరుపతి సంజీవ్ మల్లేష్ నర్సింగ్ తదితరులు ఉన్నారు

Post A Comment: