మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

     

నిరుపేదలకు రెండు పడక గదుల నివాస గృహాలు అందిస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఆరు సంవత్సరాల కింద అర్హులైన నిరుపేదలను 7వేల మందిని గుర్తించి దానిలో నుండి 25 వందల  మంది జాబితాను సిద్ధం చేసి లక్కి డ్రా రూపంలో 700 మందితో కేవలం టిఆర్ఎస్ అనుచరులకు వారి కార్యకర్తలకు మాత్రమే కేటాయించి నిజమైన లబ్ధిదారులకు అన్యాయం చేస్తూ  ప్రకటించడం జరిగింది,

ఇవ్వాలా నిరుపేదలైనా ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు దక్కాలంటే వారిని లక్కీ డ్రా రూపంలో అదృష్టం వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిందని అంటే ఇంతకంటే దిక్కుమాలిన చర్య ఇంకొకటి ఉందా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్నా, మీరుగతంలోలక్కీడ్రా రూపంలో అర్హులైన నిరుపేదలకు కేటాయించిన రెండు పడక గదుల ఇల్లను కేటాయించకుండా మళ్లీ ఇప్పుడున్న శాసనసభ్యుడు వాటిని పక్కన పెట్టేసి క్రొత్తగా లక్కీ డ్రా రూపంలో నిజమైన లబ్ధిదారులను పక్కనపెట్టి వారికి అన్యాయం చేస్తూ కేవలం వారి అనునాయులకు మాత్రమే రెండు పడక గదుల ఇళ్లను కేటాయించడం ఇది హస్యాస్పదంగా మారిందని నియోజకవర్గంలో 30 వేల నుంచి 50 వేల మంది  లబ్ధిదారులు నిరుపేదలు ఉంటే కేవలము 700 మంది నుంచి 2500 మంది వరకు మాత్రమే రెండు పడక గదులు కేటాయించి రాష్ట్ర ప్రజలందరికీ డబుల్ బెడ్ రూములు కేటాయించినం అని చెప్పుకోవడం మీకు బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పుకోవడం సిగ్గుచేటు అనిపించటం లేదా? ప్రగల్బాలు పలకడం కాదు  చేతల్లో చేసి ఆచరణలో చూపించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం.

త్వరలో జరగబోయే ఎలక్షన్స్ లో మేము ప్రభుత్వంలోకి వచ్చాక ప్రతి నిరుపేద కుటుంబానికి డబుల్  బెడ్ రూమ్ ఇండ్లు కట్టిస్తామని కాళీ స్థలం ఉంటే అందులో ఇల్లు నిర్మించి ఐదు లక్షల రూపాయల వరకు అందజేస్తామని ఈ సందర్భంగా గౌరవ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్   తెలియజేశారు,

 అంతేకాకుండా లబ్ధిదారులకు అన్యాయం జరిగిందని చెప్పి పోరాటం చేస్తే ఇవ్వాలా మీరు పోలీసు వాళ్లతో అరెస్టులు చేపించి జైల్లో పెడితే మీ  దగుల్బాజీ రాజకీయాలకు భయపడేదే లేదు ప్రజల కోసం ఎన్నిసార్లైనా జైలుకు వెళ్లడానికి సిద్ధమేనని అక్రమ అరెస్టులు ప్రజా సమస్యలను ఆపలేవని ప్రజల గొంతులను నొక్కలేవని ఈ సందర్భంగా మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్  తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్  ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి  కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు పెద్దేల్లి తేజస్వి ప్రకాష్  గాదం విజయనంద్  ప్రధాన కాంగ్రెస్ సీనియర్ నాయకులు,  టౌన్ అధ్యక్షులు మండల అధ్యక్షులు, ఆయా డివిజన్ల అధ్యక్షులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: