ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియొజకవర్గంలోని కాంగ్రెస్ మైనారిటీ నాయకుడు ఫక్రోద్దీన్ షేక్ నేడు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లీడర్ క్యాడర్ లేని పార్టీ కాంగ్రెస్ అని కాంగ్రెస్ కార్యకర్తలే కాంగ్రెస్ పార్టీని తిరస్కరిస్తున్నారన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మేము చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పార్టీలో చేరడం సంతోషకరమన్నారు.
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని ఫక్రోద్దీన్ కు ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.
ఫక్రొద్దిన్ మాట్లాడుతూ తూర్పు లో ఎమ్మెల్యే గారు చేస్తున్న అభివృద్ధి పనులు చూసి మరియు గత నాయకులు పట్టించుకోకుండా వాడుకొని వదిలేసారు, కాని ఎమ్మెల్యే నరేందర్ మంచితనం మరియు నియోజకవర్గం లో చేస్తున్న అభివృద్ధి ని చూసి బిఆర్ ఎస్ లో చేరుతున్నానని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఫకిర్ల కుల సంఘము జిల్లా అధ్యక్షుడు ఉల్ఫాత్,ముస్లిం మైనారిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Post A Comment: