మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని కాంగ్రెస్ పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు, రామగుండము నియోజక వర్గ ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ మాట్లాడుతూ62.5 మెగావాట్ల విద్యుత్ థర్మల్ ప్లాంట్ బి పవర్ హౌస్ రామగుండం ఎట్టి పరిస్థితుల్లోనైనా కొనసాగించాలి దీనిని నమ్ముకొని దాదాపు 500 మంది రెగ్యులర్ ఎంప్లాయిస్ అలాగే కాంట్రాక్టు వర్కర్స్ అలాగే కాంట్రాక్టు లేబర్స్ అలాగే డైలీ వేతనం తీసుకునే కార్మికులు అలాగే ఆర్టిజన్స్ సుమారు 2000 మంది ఆధారపడి ఉన్నారు.
ఇవాళ జెన్కో తొందరపడి ప్లాంటును కనుక మూసివేస్తే ఇవాళ దీన్ని నమ్ముకొని ఉన్న కార్మికులంతా రోడ్డున పడే అవకాశం ఉంటది అలాగే వారి భార్య పిల్లలు వీధిన పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవాళ వారి జీవితాలు అన్యాయం కావద్దనంటే బీ పవర్ హౌస్ థర్మల్ ప్లాంట్ ని కొనసాగించడమే తప్ప వేరే మార్గం లేదని ఈ సందర్భంగా ఇక్కడ ఇన్ని వనరులు ఉండంగా ఎక్కడో ఎటువంటి వనరులు లేనటువంటి యాదాద్రిలో జెన్ కో వాళ్లు ప్లాంట్ ను ఏర్పాటు చేయడం ఏంటని గత 60 సంవత్సరాలుగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు అలాగే దక్షిణ భారతదేశానికే వెలుగులు పంచుతున్నటువంటి బి థర్మల్ పవర్ హౌస్ ప్లాంట్ ని మూసివేయడం వల్ల కార్మికుల బ్రతుకులే కాదు రామగుండం ప్రాంతమంతా చీకటిమయం అవుతుంది చరిత్ర కనుమరుగవుతుంది తస్మాత్ జాగ్రత్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే రాబోయే రోజుల్లో ప్రజలు మీకు గట్టి సమాధానం చెప్తారు అని మర్చిపోవద్దు అని ఈ సందర్భంగా మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తున్న అంతేకాకుండా ఇక్కడే ఇన్ని వనరులు ఉండంగా బొగ్గు ఉండంగా నీరు ఉండంగా స్థలం ఉండంగా ఎక్కడో యాదాద్రిలో ప్లాంట్ ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమున్నది కొత్త ఫాంట్లు వేయాల్సిన అవసరం ఏమున్నది ఇక్కడ ఇంత స్థలం ఉండంగా ఇక్కడ ఎందుకు వేయకూడదు ఇక్కడే ఉన్న వారికి ఉపాధి ఎందుకు చూపకూడదు ఇక్కడున్న కార్మికులకు ఎందుకు న్యాయం చేయకూడదు ఎందుకు ఇంత నిర్లక్ష్య వైఖరి అని అన్నారు.ఇక్కడున్నశాసనసభ్యుడు మాట్లాడుతాడు మేము అధికారుల దృష్టికి తీసుకెళ్లినం కొనసాగించాలని అంటాడు కానీ మరి అధికారులు ఏమన్నారు ఆ విషయం ఎందుకు చెప్పట్లేదు ప్రజలకు ఎందుకు జవాబిదారిగా నిలబడటం లేదని ప్రశ్నిస్తున్న
పారిశ్రారామిక ప్రాంతానికి ఏమైనా చేసారు అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేసిందని కాంగ్రెస్ దివంగత నేత "వెంకటస్వామి కాకా హయాంలో FCI ఏర్పడిందని రాజశేఖర్ రెడ్డి హయాంలో సింగరేణి ఇండ్లకు పట్టాలిప్పించడం జరిగిందని పీవీ నరసింహారావు హయాంలో ఎన్టిపిసి ని ఏర్పాటు చేసిందని ఈ పారిశ్రామిక ప్రాంతానికి ఏం చేయాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందని రాబోయే రోజుల్లో మీరు గనక ప్లాంట్ ను మూసివేయాలని చూస్తే ఖచ్చితంగా మరో తెలంగాణ ఉద్యమం వలె జెన్కో ఫ్లాoట్ ను కొనసాగించాలని అటువంటి ఒక మరో ఉద్యమానికి కూడా శ్రీకారం చుట్టడానికి కాంగ్రెస్ పార్టీ వెనుకాడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఎన్టిపిసి ఎక్స్టెన్షన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదనలు పంపిస్తే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మాతో కాదు అని చెప్పేసి స్థల సేకరణ జరపకుండా ఉత్తర్వులను వెనకకు పంపించినటువంటి చరిత్ర ఇవ్వాలా రాష్ట్ర ప్రభుత్వానిధి, మేము అధికారంలోకొస్తే ఎక్స్టెన్షన్ చేయాలన్నా ఎన్టిపిసి పవర్ ప్లాంట్ ని అంతర్గమ్ గ్రామం లో ఉన్న 600 ఎకరాల స్థలంలో ప్లాంట్ ను ఏర్పాటు చేసేందుకు మేము హామీ ఇస్తున్నామని అన్నారు అంతేకాకుండా ఇవ్వాలా లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్న కల్వకుంట్ల కవిత ను కాపాడేందుకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులంతా అత్యవసర కేబినెట్ మీటింగ్లు ఏర్పాటు చేసి హుటాహుటిన ఢిల్లీకి వెళ్లి పక్షపాత ధోరణితో వ్యవహరిస్తే ఇవాళ ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. కొండగట్టులో బస్సు యాక్సిడెంట్లో 60 మంది చనిపోతే హుటాహుటిన కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయని రాష్ట్ర ప్రభుత్వం వరంగల్ లో మొన్నటికి మొన్న మెడికో ప్రీతి దుర్మార్గుల చేతిలో చనిపోతే కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేయని ప్రభుత్వం ఇవ్వాలా బిడ్డను కాపాడు కోవడం కోసం జిమ్మిక్కులు చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలను మీరు తప్పుద్రోవ పట్టిస్తుండ్లు తస్మాత్ జాగ్రత్త ఇవ్వాలా మీరు జెన్కో బి పవర్ ప్లాంట్ రామగుండం ని మూసివేయాలని గనుక చూస్తే ఖచ్చితంగా మేము ధర్నా మరియు నిరాహార దీక్ష చేయడానికి అయినా సిద్ధమని చెప్పేసి మరో తెలంగాణ ఉద్యమం వలె పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసారు

Post A Comment: