మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి గాయత్రి విద్యానికేతన్ స్కూల్ లో ప్రిన్సిపల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కౌట్స్ & గైడ్స్ దీక్ష స్వీకరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్దపల్లి జిల్లా అసోసియేషన్ స్కౌట్స్ & గైడ్స్ ప్రెసిడెంట్ గా జిల్లా కలెక్టర్ వైస్ ప్రెసిడెంట్ గా సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మరియు సెక్రటరీ గా సూర్యదేవార జ్యోతి కమిటీ సభ్యులు హాజరై సౌట్స్ & గైడ్స్ లో శిక్షణ పొందే విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది ఈసందర్బంగా వారు మాట్లాడుతూ సామాజిక సేవలో సౌట్స్ & గైడ్స్ ముఖ్య పాత్ర వహిస్తుంది అని పెద్దపల్లి జిల్లా లోని ప్రతి ఒక్క స్కూల్ ఇందులో భాగస్వామ్యం అయి విద్యార్థులను శిక్షణ పొందే విదంగా చూడాలి అని ఈశిక్షణ విద్యార్థి యొక్క జీవితాన్ని మెరుగుగా తీర్చిదిద్దే దిశ గా ఉంటుంది అని పేర్కొన్నారు తదుపరి స్కూల్ వారు అతిధులుగా విచ్చేసిన వారికి సన్మానం చేయడం జరిగింది ఈకార్యక్రమంలో స్కూల్ విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: