మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పెద్దపల్లి జిల్లా రామగుండం అంబేద్కర్ చౌక్ వద్ద ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు కుక్క గంగా ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ సి ఆర్ పి ఎస్ ను బలపేతం చేసేందుకు సమావేషాలు నిర్వహించి కమిటీలను వేయడం జరుగుతుందని అందులో భాగంగానే ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఉపాధ్యక్షునిగా వేల్పుల నర్సయ్య కు నియామక పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ హాజరై వెల్పుల నర్సయ్య కండువా కప్పి సంస్థలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కార్పొరేషన్ అధ్యక్షుడు కుక్క గంగా ప్రసాద్ మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు మారేడు మోహన్ , పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ ల సూచన మేరకు ఎస్సీఆర్పిఎస్ రామగుండం కార్పొరేషన్ 32 వ డివిజన్ ఇందిరానగర్ కు చెందిన వేల్పుల నర్సయ్యను నియమించడం జరిగిందనీ దేశంలో ఎస్సీల రిజర్వేషన్ దుర్వినియోగం కాకుండా సంస్కృతి, సాంప్రదాయాలను, రాజ్యాంగాన్ని , రాజ్యాంగం ప్రసాదించిన రిజర్వేషన్లను కాపాడాలని, భారతీయ మూల సంస్కృతి పితామహులైనటువంటి బాహుబలి ఆది జాంబవంతుడు , గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు పూలే, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ ఆశయాలను కొనసాగిస్తూ రామగుండం కార్పొరేషన్ లో సంస్థను బలోపేతం చేస్తారని ఆశిస్తూ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు అసంపల్లి ఉదయ్ కిరణ్, ఎస్సీఆర్పిఎస్ యుత్ జిల్లా అధ్యక్షులు బి. ప్రెమ్ కుమార్, యూత్ జిల్లా కార్యదర్శి ఇదూనూరు శ్రీమన్ , ఉప్పులేటి పవన్, రాజేందర్, సారయ్య, తదితరు పాల్గొన్నారు.

Post A Comment: