మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
మహాదేవపూర్:మంథని నియోజకవర్గ,ముఖ్య కార్యకర్తల సమావేశం లో బీజేపీ సీనియర్ నాయకులు...
పెద్దపల్లి జిల్లా,మంథని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఈరోజు నియోజకవర్గం లోని అన్ని మండలాల అధ్యక్షులు,ఇంచార్జ్ లు, ప్రధాన కార్యదర్శుల,జిల్లా సీనియర్ నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశనికి ముఖ్య అతిధులుగా జిల్లా ఇంచార్జ్ రావుల రాంనాథ్,ప్రబరి అనిల్, బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి, పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
మంథని నియోజకవర్గం ప్రజల్లో బీజేపీ నాటుకుందని, విశ్వాసంతో రోజు రోజుకు ప్రజాదారణ పెరుగుతుందని, ప్రతిఒక్కరూ గెలుపే లక్ష్యంగా పని చేయాలన్నారు.కెసిఆర్ నియంత,కుటుంబ పాలనకి బీజేపీ తోనే స్వస్తి పలకాలని,గ్రామ స్థాయి నుండి బూత్ కమిటీ లను పూర్తి చేయాలన్నారు,ఈనెల 7వ తేదీన బూత్ కమిటీ సభ్యులతో,మంథని ఎస్.ఎల్.బి ఫంక్షన్ హాల్ లో బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డ తో వర్చువల్ మీటింగ్ ఉంటుందని,ఈ ప్రాంతం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీధర్ బాబు నియోజకవర్గ అభివృద్ధిని విస్మరించి,చుట్టం చూపుగా నియోజకవర్గం లో తిరుగుతున్నాడు,మన ప్రాంతం నుండి బొగ్గు ఇసుక నీళ్లు నిధులు తరలించుక పోతు మంథని ప్రాంతా ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్న పట్టించుకోవడం లేదన్నారు. మంథని నియోజకవర్గంలోని అన్ని మండలాలలో పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి ప్రణాళికతో కొత్త ఇన్చార్జీలను నియమించడం జరిగిందని, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో బిజెపి అధికారం లోకి రావడం జరుగుతుందని అన్నారు.ఈకార్యక్రమంలో సీనియర్ నాయకులు కొండపాక సత్య ప్రకాష్, మహావాది రామన్న,విజయ్ కుమార్,మండల అధ్యక్షులు వేల్పుల రాజు,జంగపల్లి అజయ్,మల్కామోహన్ రావ్,సిరిపురం శ్రీమన్నారాయణ,బొమ్మన భాస్కర్ రెడ్డి,కోయల్ కార్ నిరంజన్,మండలాల ఇంచార్జ్ లు బోగోజు శ్రీనివాస్,మట్ట శంకర్,ఎడ్ల సదశివ్,బిరుదు గట్టయ్య, ఉడుముల విజయ రెడ్డి, బండ వసంత రెడ్డి,మచ్చగిరి రాము,ఆకుల శ్రీధర్,పగే రంజిత్,రామగిరి నాగరాజు,చిలువేరి సతీష్, మండల ప్రధాన కార్యదర్శులు,నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Post A Comment: