మహాదేవపూర్ మండల ప్రతినిధి దూది శ్రీనివాస్
మహాదేవపూర్:మేడిగడ్డ ప్రాజెక్టు,కాళేశ్వరం బ్యాక్ వాటర్ తో పంట పొలాలు, చేన్లు మూడోసారి కూడా నీట మునగడంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలిగి మనస్థాపానికి గురై, ఆందోళన చెందుతున్న సమీప మహారాష్ట్ర వ్యవసాయదారులు..సిరోంచ తాలుక లోని అరుడ,జానంపల్లి, మద్దికుంట,మండలపురం పలు గ్రామాలకు చెందిన పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు తాము బ్యాక్ వాటర్ ముంపు తో మూడు సార్లు పంట వేయడం జరిగింది,మూడుసార్లు పంట పొలాలు నీట మునగడం జరిగి కష్టనష్టాలు జరిగాయని,పంటల పెట్టుబడి అప్పులు పెరిగాయని,తమ గోడు వెలగొచ్చుకుంటున్నారు.ఈ ప్రాజెక్టు వలన మహారాష్ట్ర సమీప ప్రాంత గ్రామాల రైతులకు ఇంత నష్టాలు జరిగినా కానీ,తమకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా, కాలయాపన చేస్తూ,ప్రస్తుతం జరిగిన నష్ట పరిహారం కూడా ఇవ్వకుండా,తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నారని,వ్యవసాయ భూమిని నమ్ముకొని బ్రతికే తమకు చావే శరణ్యమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తు,ఇకనైనా మా కష్టనష్టాలను గ్రహించి, తెలంగాణ ప్రభుత్వం మాకు ఇచ్చిన హామీలు త్వరగా నెరవేర్చాలని వేడుకుంటున్నారు.


Post A Comment: