మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో,నిరుపేద కార్మికులు ఇళ్ల స్థలాలు కావాలని గత పది రోజుల నుండి దీక్షలు చేస్తున్న కూడా, అటు ప్రజా ప్రతినిధులు,అధికారాలు కానీ ఎవరు పట్టించుకోకపోవడంతో వారు సహనం కోల్పోయి,ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు.అందులో భాగంగా తీన్మార్ మల్లన్న టీంను, మాకు మద్దతుగా నిలవాలని కోరారు. అందుకుగాను జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ తక్షణమే నిరుపేద కార్మికులకు సంపూర్ణ మద్దతు ప్రకటించి,వారికి వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని, ఇప్పటివరకు కట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను వెంటనే పేద ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు.డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు కట్టి అందులో చెట్లు మొలిచి శిధిలావస్థకు చేరుతున్న కూడా,ఇంతవరకు అధికారులు వాటిని లబ్ధిదారులకు ఎందుకు పంచడం లేదని,అర్హులైన వారికి వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది. నిరుపేద కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష ఎన్ని రోజులు చేసినా,అందుకు తీన్మార్ మల్లన్న టీం మద్దతు, సహకారం ఉంటుందని రవి పటేల్ హామీ ఇవ్వడం జరిగింది.

Post A Comment: