మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మూడో వ డివిజన్ అన్నపూర్ణ కాలనీకి చెందిన బొంకూరి అంజమ్మ అనే మహిళ జనవరి 1 వ తేదీన మరణించడం జరిగిందని మరణించిన అంజమ్మ కు ఇద్దరు ఆడపిల్లలు ఒక అమ్మాయి వికలాంగురాలు అని ఇద్దరు ఆడపిల్లలకు మరియు కుటుంబాన్నికి పెద్దదిక్కుగా ఉన్న అంజమ్మ మరణంతో కుటుంబ సభ్యులకు ఇల్లు గడవడం కష్టంగా ఉందని ఆంజమ్మ కుటుంబీకులు సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ కు ఫోన్ చేసి వారి దీనపరిస్థితిని తెలుపగా వెంటనే స్పందించి ఫౌండేషన్ సభ్యులు తగురం రాజేందర్ ద్వారా 25 కిలోల బియ్యం పంపించడం జరిగిందనీ కుటుంబీకులు తెలిపారు అనంతరం తగరం రాజేందర్ మాట్లాడుతూ మరణించిన బొంకూరి అంజమ్మ యొక్క కుటుంబ పరిస్థితిని మడిపెల్లి మల్లేష్ అన్న కు తెలుపగా ఆంజమ్మ కుటుంబానికి నా ద్వారా బియ్యం పంపించడం జరిగిందని రాజేందర్ తెలిపారు అడుగగానే ఆంజమ్మ కుటుంబానికి సహాయం అందించిన మడిపెల్లి మల్లేష్ కు మరియు ఫౌండేషన్ కు సహకారాలు అందిస్తున్న సభ్యులకు ఆంజమ్మ కుటుంబం తరుపున రాజేందర్ కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ ప్రతినిదులు జూల వినయ్. గౌరదీప్ పాల్గొన్నారు..

Post A Comment: