మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్/ హైదరాబాద్:తెలంగాణ సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర నాయీ బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో, యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారికి 101 కొబ్బరికాయలు కొట్టి, విశేష పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాలకృష్ణ,ఉపాధ్యక్షుడు రాజు,యాదాద్రి జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, నేతలు సంగం శివ,జంపాల శ్రీనివాస్,పయ్యావుల కృష్ణ, పయ్యావుల శ్రీనివాస్, సతీశ్, వేణుగోపాల్ పాల్గొన్నారు. భారత రాష్ట్ర సమితి ద్వారా దేశం సుభిక్షంగా ఉండాలని, అన్ని రంగాల్లో ముందుకు వెళ్లాలని కాంక్షిస్తూ బుధవారం ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ దర్గాలో హోం మంత్రి మహమూద్ అలీ, పలువురు ముస్లిం పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.

Post A Comment: