మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్టిపిసి జ్యోతి నగర్ ఈనెల 10న ర్యాలీ బహిరంగ సభను విజయవంతం చేయండి
ఈనెల 10 11 తేదీలలో సిఐటియు జిల్లా మహాసభల సందర్భంగా సిఐటియు ఎన్టిపిసి రామగుండం ఏరియా కమిటీ ఆధ్వర్యంలో సిఐటియు జెండాలు ఆవిష్కరణలు చేయడం జరిగింది సి ఐ టి యు ఆర్ ఐ డబ్ల్యూ యూనియన్ జెండాను యూనియన్ ఉపాధ్యక్షుడు కాదాసి మల్లేష్ ఎన్టిపిసి మేడిపల్లి సెంటర్లో బిల్లింగ్ సంఘం నాయకుడు సిహెచ్ కనకయ్య ఆవిష్కరించడం అయినది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు ఎన్ బిక్షపతి ప్రధాన కార్యదర్శి ఎం రామాచారి హాజరైనారు సిఐటియు రామగుండం ఇండస్ట్రియల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఎండి యాకుబ్ వారు మాట్లాడుతూ సిఐటియు జిల్లా మూడవ మహాసభలు ఎన్ టి పి సి టీవీ గార్డెన్లో ఈనెల 10 11 తారీఖుల్లో జరగనున్నాయని ఈ మాసభలకు ముఖ్యఅతిథిగా
సిఐటియు అఖిలభారత ఉపాధ్యక్షుడు కామ్రేడ్ ఎం సాయిబాబు మరియు రాష్ట్ర కార్యదర్శులు భూపాల్ మరియు మధు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడడం జరుగుతుంది కావున ఈ ప్రాంతంలో ఉన్న సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం అన్ని రంగాల కార్మికులు అధిక సంఖ్యలో హాజరై పదో తారీకు శనివారం నాలుగు గంటలకు గేటు నెంబర్ 2 నుండి టీవీ గార్డెన్ వరకు ర్యాలీ అనంతరం బహిరంగ సభను విజయవంతం చేయగలరని కోరుతున్నాం అట్లాగే తెల్లవారి 11 వ తారీకు నాడు ప్రతినిధుల సభ ఉంటుందని మాట్లాడడం జరిగింది ఈరోజు జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమాలలో పాల్గొన్న నాయకులు సిఐటియు జిల్లా మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షులు ఎన్ శంకర్ సిఐటియు ఏరియా కన్వీనర్ గిట్ల లక్ష్మారెడ్డి నాయకులు తోట రవీందర్ అక్కపాక శంకర్ వి శ్రీనివాసరెడ్డి ఎం కృష్ణారెడ్డి జి సంతోష్ ధరణి రాజయ్య కుమార్ రాజయ్య సదానందం మరియు తదితరులు పాల్గొన్నారు
Post A Comment: