మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: జిల్లా విద్యా వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ కనబరిచి,రాష్ట్ర వైజ్ఞానిక ప్రదర్శనకు జెడ్పిహెచ్ఎస్ బాలురు మహాదేవపూర్ పాఠశాల విద్యార్థిని,విద్యార్థులు కమ్యూనికేషన్ విభాగంలో సల్పాల దేవిక,ఒలిశెట్టి సాయిస్పందనలు ఎవరు ఏది రాసినా కనురెప్పల కదలికలతో చెప్పి అందర్ని ఆకట్టుకొని జిల్లా స్థాయిలో, ప్రథమ స్థానంలో నిలిచారు.కాలుష్యనివారణలో భాగంగా వీధి దీపాల విద్యుత్ వృధాను తగ్గించే ప్రాజెక్టుకు చకినాల అభిరామ్ ప్రథమస్థానం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికయ్యాడు.ఎకో ప్రెండ్లీ విభాగంలో మొహమ్మద్ ఇక్రా అనే అమ్మాయి ప్రథమ స్థానం సాధించి రాష్ట్ర పోటీలకు ఎంపికైంది.
మనగణితం విభాగంలో ఆకుతోట మల్లిక రెండవ స్థానం,మరియు అదేకాకుండా సల్పాల నందిని,సల్పాల సంకీర్తన, అంబ పలుకు జగదాంబ పలుకు అనే గారడీ విద్యతో సభికులందరిని నవ్వుల్లో ముంచెత్తి,విద్యా శాఖా మంత్రి సబిత ఇంద్రారెడ్డి నుండి ఒక బంగారు పెన్నును బహుమతిగా పొంది పాఠశాల పేరును రాష్ట్రస్థాయిలో మారుమోగేలా చేసి,అందరి మన్ననలు పొందారు.వీరికి గైడ్ టీచర్ గా వ్యవహరించిన ఫిజిక్స్ టీచర్ మడక మధుని పలువురు అభినందించారు. విద్యార్థులకు, ఉపాధ్యాయులకు, ప్రధానోపాధ్యాయులు అభినందనలు తెలిపారు.ఇలాంటి ప్రాజెక్ట్ చేయడం వల్ల,విద్యార్థులలో సృజనాత్మకత పెరుగుతుందని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.మరింత మంది విద్యార్థులు ఇలాంటి పోటీలలో పాల్గొని, పాఠశాలకు మరింత పేరు ప్రఖ్యాతులు తేవాలని కోరారు.
Post A Comment: