మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఆర్ ఎఫ్ సి ఎల్లో ఉద్యోగాల పేరుతో మోసపోయిన బాధితులు వాళ్ళ డబ్బులు తిరిగి చెల్లించాలని స్థానిక మున్సిపల్ ఆఫీస్ కార్యాలయం ఎదురుగా ఉన్న భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మద్దతుగా హాజరైన కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్ మాట్లాడుతూ అఖిలపక్ష కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా బాధితులందరికీ డబ్బులు తిరిగి చెల్లించే విధంగా స్థానిక శాసన శాసనసభ్యులు చర్యలు చేపట్టాలని వారం రోజుల్లో ఎవరీ డబ్బులు వారికి తిరిగి చెల్లించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు*బాధితుల సంఘం నాయకులు సిరిశెట్టి సుమన్ మాట్లాడుతూ గత మూడు నెలలుగా క్యాంప్ ఆఫీస్ చుట్టూ తిప్పించుకుంటూ కాలయాపన చేస్తూ అఖిలపక్ష కమిటీల పేరుతో కాలం వెల్లదీస్తున్నారే తప్ప మాకు ఎటువంటి న్యాయం చేయట్లేదని అఖిలపక్ష కమిటీ ఎంతవరకు కనీసం మమ్మల్ని సంప్రదించలేదని మేము ఏం చెప్పిన పరిగణలోకి తీసుకుంట లేరని వెంటనే మా డబ్బులు మాకు తిరిగి తరలించకపోతే తీవ్ర స్థాయిలో ఉద్యమం చేస్తమని హెచ్చరించారు*ఈ కార్యక్రమంలో NSUI జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గాప్రసాద్ బాధితులు పరకాల శ్రీనివాస్ జక్కుల తిరుపతి కాటన్ తిరుపతి కుక్కర్ కుమారస్వామి జక్కుల సురేష్ బైరి వెంకటేష్ తవుటమ్ నరేందర్ కొల్లూరి రవి సిలారపు తిరుపతి సంతోషం రాజేష్ సంతోష్ రెడ్డి రాకేష్ పెయాల శ్రీకాంత్ అయితే శ్రావణ్ పున్నమిని హరీష్ మేకల శశి కుమార్ తోట హరిప్రసాద్ దొంగల శశి కుమార్ మురళి తదితరులు పాల్గొన్నారు

Post A Comment: