మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


ఈరోజుతో కాంట్రాక్టు కార్మికుల నిరవధిక సమ్మె 6వ రోజుకు చేరుకుంది. ఈసందర్భంగా మెయిన్ చౌరస్తా నుండి శివాజీ నగర్,మేదరి బస్తీ, కల్యాణ్ నగర్,

లక్ష్మీ నగర్ ల మీదుగా వందలాది మంది కాంట్రాక్టు కార్మికులతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం మెయిన్ చౌరస్తాలో మానవహారం చేయడం జరిగింది.

ఈకార్యక్రమానికి కాంగ్రేసు పార్టీ నాయకులు మక్కాన్ సింగ్, టీఆరెస్ నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య  పాల్గొని కార్మికులు చేస్తున్న సమ్మెకు మద్దతు తెలిపారు. జె.ఏ.సి. నాయకులు వేల్పుల కుమారస్వామి, 

తోకల రమేష్,యాదగిరి సత్తయ్య,ఈ.నరేష్,మద్దెల శ్రీనివాస్ లు మాట్లాడుతూ 6వ రోజు సమ్మెలో పాల్గొని సమ్మెను జయప్రదం చేసిన కార్మికులకు విప్లవాభివందనాలు తెలిపారు. న్యాయమైన సమస్యలు  పరిష్కరించాలని సామరస్యంగా,

శాంతియుతంగా మా బాధలు చెప్పుకుందామని ఛలో అసెంబ్లీకి వెల్లుతుంటే రాష్ట్ర ప్రభుత్వం కక్ష పూరితంగా వ్యవహరించి నాయకులను,కార్మికులను అక్రమంగా అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసం కాదన్నారు. అంతేకాకుండా వందలాదిమంది నాయకులను,కార్మికులను అర్థ రాత్రి ఇండ్లను ముట్టడించి అరెస్టులు చేసి వివిధ పోలీసు స్టేషన్లో నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అయినప్పటికీ ప్రభుత్వ కుట్రలను భగ్నం చేసి హైదరాబాద్ కు వేలాదిమంది కార్మికులు చేరుకుని ర్యాలీ ని జయప్రదం చేశారని అన్నారు. కార్మికులకు పోరాటాలు, ఉద్యమాలు కొత్త కాదని అన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొని రాష్ట్రం సాధించుకున్న ఘనత కార్మిక వర్గానికి ఉన్నదని ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు మరచి పోవద్దని గుర్తు చేశారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండు చేశారు. లేనిపక్షంలో కార్మికుల ఆగ్రహానికి గురి కాకా తప్పదని హెచ్చరించారు. అదేవిధంగా సింగరేణి యాజమాన్యం చర్చల పేరుతో కాలయాపన చేయాలని చూస్తుందని అన్నారు.పాత కార్మికుల స్థలంలో కొత్త కార్మికులను పెట్టి పనులు చేయించండి అని కాంట్రాక్టర్ల తో మిటింగ్ పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్న ఆనందరావు  తమ నిరంకుశ విధానం మానుకోవాలని అన్నారు.యాజమాన్యం ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగితే కార్మికులను తొలగిస్తామని అనడం సిగ్గుచేటని అన్నారు.అదే జరిగితే రాబోవు రోజుల్లో జరుగు పరిణామాలకు పూర్తి బాధ్యత యాజమాన్యమే వహించాల్సి ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో నాయకులు బి.లింగయ్య, సిహెచ్. ఉపేందర్, కె.మోగిళి,కె.శంకర్,

సదానందం, రాజేందర్, మదునమ్మ,స్వప్న,

మరియమ్మ,కొమురయ్య, మధు,రాధిక,కొమురమ్మ,కోట వెంకన్న,మల్లీశ్వరి, భాగ్య,వినోద,వసంత తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: