ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నేటి బాలలే రేపటి నవ భారత నిర్మాతలు బాలల శ్రేయస్సే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ వారి బంగారు భవిష్యత్తు కొరకు బాల రక్షక్ భవన్ లు ఏర్పాటు చేసారు. మానవత దృక్పథంతో నిస్సహాయత స్థితిలో ఉన్న చిన్నారులను తానే స్వయంగా వెళ్లి బాల రక్షక భవన్ లో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ చేర్పించారు.
వరంగల్ నగర పాలక సంస్థ దగ్గర రెండు రోజుల క్రితం ఆక్సిడెంట్ లో తల్లిని కోల్పోయి నిస్సహాయత స్థితిలో ఉన్న చిన్నారుల విషయం స్థానిక నాయకుల ద్వారా తెలుసుకున్న చీఫ్ విప్ వినయ్ భాస్కర్ తక్షణమే స్పందించి హుటాహుటిన జిల్లా బాల రక్షక అధికారులతో కలిసి వెళ్లి చిన్నారుల స్థితిగతులు తెలుసుకొని వారి రక్షణ మరియు బంగారు భవిష్యత్ కొరకై చీఫ్ విప్ స్వయంగా వెళ్లి లష్కర్ బజార్ లోని బాల రక్షక్ భవన్ చేర్పించి వారి వారి భవిష్యత్తు ను తీర్చి దిద్దాలని అధికారులకు సూచించారు.
కార్యక్రమంలో బాలల రక్షణ జిల్లా అధికారి సంతోష్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Post A Comment: