మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎన్ టి పి సి. ఐ ఎఫ్ టి యు కార్యాలయంలో ఎన్ టి పి సి ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో *సిపిఐ (ఎం ఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి కె రాజన్న, ఐ ఎఫ్ టి యు జిల్లా అధ్యక్షులు ఈదునూరీ నరేష్, పిసికేఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుక శంకర్ లు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్ల యొక్క వేతనాలు చట్టబద్ధ హక్కులు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదన్నారు వీరికి వస్తున్న వేతనాలు కుటుంబాల పోషణకు ఏమాత్రం సరిపోవటం లేదు ఇంటికిరాయిలు కరెంటు బిల్లులు పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేక అనేక అవస్థలు పడుతున్నారు రోజురోజుకు మార్కెట్ ధరలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో ఈ ట్రాక్టర్ డ్రైవర్లు పొందుతున్న వేతనాలకు పొంతన లేకుండా పోతుందన్నారు ఇప్పటికైనా ఈ ట్రాక్టర్ డ్రైవర్లకు చట్టబద్ధంగా రావలసిన కనీస వేతనాల చట్టబద్ధ హక్కులు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
ట్రాక్టర్ల పైన చేస్తున్న డ్రైవర్లకు ఆరోగ్యాలు పాడవుతున్నాయి ఎక్కువ కోశాతం నడుం నొప్పుల వల్ల అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. మోటార్ రంగంలో పనిచేస్తున్న అన్ని రకాల కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరంగా వచ్చేటువంటి సంక్షేమ పథకాల్లో ఈ కార్మికులకు అమలు చేయాలని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
ఈ జనరల్ బాడీ సమావేశంలో సంఘం అధ్యక్షులు బి కొమరయ్య ప్రధాన కార్యదర్శి ఏ మురళి ఎం తిరుపతి బి శ్రీనివాస్ పి మహేష్ బాలరాజు లావణ్య అనిల్ కుమార్ ఏ అశోక్ ఎస్ మహేందర్ జి స్వామి ఎన్ చంటి ఎస్ సురేష్ ఎం కృష్ణ లతోపాటు తదితరులు పాల్గొన్నారు.
అనంతరం ఎన్ టి పి సి ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్..
*నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది.గౌరవ అధ్యక్షులుగా ఈదునూరి నరేష్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా చిలుక శంకర్, అధ్యక్షులుగా బి కొమరయ్య, ప్రధాన కార్యదర్శిగా ఏ మురళి, ఉపాధ్యక్షులుగా ఎన్ తిరుపతి, సహాయ కార్యదర్శిగా బి శ్రీనివాస్, కోశాధికారిగా పి మహేష్, ల తోపాటు మరో 8 మందిని కార్యవర్గ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది.
గతంలో ఈ సంఘానికి గౌరవ అధ్యక్షుడిగా వున్న జి సత్యనారాయణ రెడ్డి ఈ సంఘం నుండి తొలగించడం జరిగింది.
ఇక నుండి జి సత్యనారాయణ రెడ్డి కి ఈ ట్రాక్టర్ డ్రైవర్స్ యూనియన్ కు ఎలాంటి సంబంధం లేదు.
Post A Comment: