మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ప్రగతిశీల మహిళా సంఘం (POW) ఆధ్వర్యంలో అంతర్గామ్ మండలం పెద్దంపేటలో మహిళా దినోత్సవ సభ జరిగింది ఈ సభకు ప్రగతిశీల మహిళా సంఘం POW రాష్ట్ర అధ్యక్షురాలు కామ్రేడ్ చండ్ర అరుణ హాజరై మాట్లాడుతూ నేడు పాసిస్టు ప్రమాదం అన్ని రంగాలను, అన్ని వర్గాలను ముంచెత్తుతున్నది. సైన్స్ స్థానంలో అశాస్త్రీయ భావాలను జ్యోతిష్య శాస్త్రాన్ని, మనువాద భావజాలాన్ని ప్రవేశపెడుతున్నది. లవ్ జిహాద్, గర్ వాపసి, హలాల్, హిజాబ్, పౌరసత్వ చట్టం తదితర పేర్లతో మైనార్టీలపై దాడులకు హత్యలకు పూనుకుంటున్నది. దళితులపై మైనారిటీలపై జరుగుతున్న దాడులు, హత్యలు పాసిస్టు చర్యల్లో భాగమే. అందుకే ముంచుకొస్తున్న పాసిస్తు ప్రమాదంపై మహిళలపై మనువాద దాడికి వ్యతిరేకంగా మహిళా దినోత్సవ స్ఫూర్తితో పోరాడాలని, ఢిల్లీ సరిహద్దుల్లో రైతాంగం సాధించిన ఉద్యమ విజయం ప్రేరణతో మహిళలు ఉద్యమ బావుట ఎగరవేయాలని, కేంద్ర ప్రభుత్వ మతోన్మాద మనువాద విధానాలకు వ్యతిరేకంగా, సంఘటిత సమైక్య ఉద్యమానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. *POW రాష్ట్ర నాయకురాలు కోడిపుంజుల లక్ష్మీ అధ్యక్షతన జరిగిన ఈ సభలో IFTU తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం,POW జిల్లా నాయకురాలు కొట్టే స్వరూప, మార్త రాధ, పెండ్యాల మాలతి, CPI ML ప్రజాపంధా జిల్లా కన్వీనర్ గుజ్జుల సత్యనారాయణరెడ్డి, అడేపు శంకర్, మాటేటి కవిత, కల్పన,జూపాక లక్ష్మి, గుమ్మడి విజయలక్ష్మి, మార్త రాములు, గుమ్మడి వెంకన్న,బి.కృష్ణ లతో పాటు 100 మంది మహిళలు పాల్గొన్నారు.సభ ఆనంతరం పెద్దoపేటలో బారీ మహిళా ప్రదర్శన నిర్వహించారు
Post A Comment: