మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని భాస్కర్ రావు భవన్ ఏఐటియుసి కార్యాలయంలో ఓబి కాంట్రాక్టు కార్మికుల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాతవాహన మల్టిపుల్ వర్కర్స్ యూనియన్ నాయకులు కౌశిక్ హరి,AITUC ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య, CITU అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి, IFTU (ప్రజాపంథా) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సూర్యం, IFTU (న్యూడెమోక్రసీ) రాష్ట్ర కార్యదర్శి ఐ కృష్ణ,INTUC తెలంగాణ, ఆంధ్రరాష్ట్రాల కార్యదర్శి పూసాల తిరుపతి,TCKS (తెరాస) అధ్యక్షులు మద్దెల శ్రీనివాస్ మాట్లాడుతూ ఓబి యాజమాన్యాలు కార్మిక సమస్యలపై కార్మిక సంఘాలతో చర్చించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయి. మార్చి 6 తారీకు నుంచి సమ్మె ప్రకటించినప్పటికీ మొద్దు నిద్రపోతున్నట్టు నటిస్తున్నది విఫలం చేసేందుకు మాత్రం కుటిలయత్నాలను కొనసాగిస్తున్నాయి. ఓబి యాజమాన్యాలు ఎంతగా బెదిరింపులకు దిగినా పట్టుదలతో సమ్మెను విజయవంతం చేయాలని, తమ హక్కులు సౌకర్యాలపై జరిగే సమ్మెను విజయవంతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. మార్చి 6 నుంచి జరిగే సమ్మెకు ఓబి యాజమాన్యాల మొండి వైఖరి ప్రధాన కారణమని చట్ట ప్రకారం కార్మిక సంఘాలతో చర్చలకు ఆహ్వానించకుండా సమ్మెకు దారి చేసే పరిస్థితులు కల్పిస్తున్నాయని తెలియజేస్తున్నాం. ఐక్యంగా జరగబోయే సమ్మెను విజయవంతంగా కొనసాగించే విజయం సాధించాలని ఈ సందర్భంగా వక్తలు అభిప్రాయపడ్డారు.
ఓబీ కాంట్రాక్టు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు AITUC నాయకులు బుర్ర తిరుపతి,CITU నాయకులు వేల్పుల కుమారస్వామి, IFTU (ప్రజా పంథా) నాయకులు తోకల రమేష్, IFTU (న్యూడెమోక్రసీ) నాయకులు ఏ వెంకన్న, INTUC నాయకులు పూసాల తిరుపతి,TCKS నాయకులు మద్దెల శ్రీనివాస్, ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్ తదితరుల తో పాటు 500 మంది కార్మికులు పాల్గొన్నారు
Post A Comment: