మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

మంథని మండలం ఈ రోజు  ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి మంథని నియోజకవర్గ నాయకులు  అక్షయ్  ఆధ్వర్యంలో ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు భుషిపాక సంతోష్ మహారాజ్  ఆదేశాల మేరకు మంథని ఎమ్మార్వో బండి ప్రకాష్ వినతి పత్రం సమర్పిస్తూ ఈ సందర్భంగా మాట్లాడుతూ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల మంథనిలో గత కొన్ని సంవత్సరాలుగా ఉన్న సెల్ఫ్ సెంటరిని సంవత్సరం నర కిందట ప్రైవేటు రోషిణి డిగ్రీ కళాశాల వాళ్ళు సెంటర్ వేస్కోవడం జరిగింది. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఫ్రమ్ సెల్ఫ్ సెంటర్ ని తీసివేయడం జరిగింది. అలా తీసి వేయడం వల్ల విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంథనిలో బడుగు బలహీన వర్గాల వారు ఎస్సీ , ఎస్టీ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధమైనటువంటి పరిస్థితి ఏర్పడడం వల్ల మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో స్ట్రెంథ్ తగ్గుతుంది అడ్మిషన్స్ అనేవి ఎక్కువగా కావడం లేదు. ఇలాగే కొనసాగితే కళాశాల కూడా మూత పడే అవకాశం ఉంది. అందువల్ల పూర్వం మా కళాశాలలో ఉన్న పరీక్ష కేంద్రానికి వెళ్ళే సెంటర్ ని మళ్ళీ వేయగలరని ఎస్సీ రిజర్వేషన్ పరీక్ష సమితి మంథని నియోజకవర్గం పక్షాన విద్యార్థులమైన మేము మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్థులు A.రాజ్ కుమార్, M.భక్తసిరియాల, N.వరుణ్, B.ఆకాశ్‌, D.దీవన్ కుమార్, I.రవి చందర్, R.అనిల్ కుమార్. G.భానుప్రకాష్, R.రాహుల్  తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: