మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 41వ డివిజన్ గాంధీనగర్ కు చెందిన గద్దల అనిల్ కుమార్ కుమార్తె సాయి సుదీక్షిత మెడిసిన్ విద్యార్థినికి ప్రతి నెల మొదటి వారంలో  సేవా స్పూర్తి ఫౌండేషన్ తరుపున విద్యార్ధినికి రెండు వేల రూపాయలు అందజేస్తూన్నా విషయం తెలిసిందే అందులో భాగంగా శనివారం రోజున గాంధి నగర్ లోని విద్యార్థిని ఇంటి వద్దకు వెళ్లి సేవా స్పూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్  రెండు వేల రూపాయల ఛెక్ ను ఫౌండేషన్ సభ్యుల సహకారంతో అందజేయడం జరిగిందని మల్లేష్ తెలిపారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ గత 11 నెలల నుంచి ఫౌండేషన్ సభ్యుల సహకారంతో హైదరాబాద్ లో మెడిసిన్ చదువుతున్న సాయి సుదీక్ష కు సేవా స్పూర్తి ఫౌండేషన్ నుండి ప్రతి నెల అమ్మాయి ప్యాకెట్ మని కోసం మేం ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల మొదటి వారంలో విద్యార్థిని తండ్రి అనిల్ కుమార్ కు రెండు వేల రూపాయలు అందజేస్తున్నమని ప్రతి నెల ఫౌండేషన్ కు సహకారాలు అందిస్తున్న సభ్యులందరికి పేరుపేరునా సాయి సుదీక్ష కుటుంబం తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని.మా ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తు నిరుపేదల ప్రజలల్లో గుర్తింపు పొందిన మా సేవ స్పూర్తి ఫౌండేషన్ ను ముందుకు నడిపిస్తున్న సభ్యులకు మరొక్కసారి నిరుపేద కుటుంబాల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూన్నానని ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: