మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గోదావరిఖని ,  ఏజెన్సీ దళితుల సమస్యల పరిష్కారానికి పార్లమెంట్లో మరోసారి మాట్లాడాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేత ను కోరారు.పెద్దపల్లి జిల్లా రామగుండం కార్పొరేషన్ లోని పలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు హాజరైన పెద్దపల్లి ఎంపీ డాక్టర్ బోర్లకుంట వెంకటేష్ నేతను దుర్గం నగేష్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి పలు ఏజెన్సీ దళితుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తాతలతండ్రుల కాలం నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు పుట్టిన భూమిపై హక్కు లేదని, సాగు భూములకు, పోడు భూములకు హక్కు పత్రాలు లేవని, తద్వారా ప్రభుత్వాలు ప్రవేశపెట్టే రైతు బీమా రైతుబంధు మొదలైన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు, రాజకీయ రిజర్వేషన్ లేక  కనీసం సర్పంచ్ అయ్యే అవకాశం కూడా లేదని తెలిపారు, అక్కడి విద్యార్థినీ విద్యార్థులకు డిగ్రీలు పేజీలు చదివిన కూడా 2000 సంవత్సరంలో వచ్చిన జీవో 3 తో స్థానిక ఉద్యోగ నియమాకాల్లో అవకాశాలు నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏజెన్సీ దళితులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రంగంలో చూసిన  అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు..ఏజెన్సీ దళితుల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి  కొంత బడ్జెట్  కేటాయించాలని, దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని.ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులకు గుర్తించి ఎస్టీలతోపాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు జీవో త్రీ రద్దు తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ ఏజెన్సీ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే కోరుగంటి చందర్, 3వ డివిజన్ కార్పొరేషన్ కుమ్మరి శ్రీనివాస్,మేడిపల్లి గ్రామ నేతకాని మహిళలు తదితరులు ఉన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: