ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ఎస్సై సుధాకర్ మరియు పోలీస్ సిబ్బంది మరియు 58/జి బిఎన్ సీఆర్పీఎఫ్ సిబ్బంది కలిసి కాటారం మండలంలోని బొప్పారం క్రాస్ వద్ద పెట్రోల్ నిర్వహిస్తున్నారు. ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం(బాక్సర్) బైక్ పై ఉదయం 10. 30 గంటల సమయంలో అనుమానాస్పదంగా వస్తు, మమ్ములను చూసి భయపడి పారిపోవుటకు ప్రయత్నించగా మేము వెంబడించి పట్టుకొని ఆ వ్యక్తిని విచారించగా వ్యక్తి పేరు పొలం రాజయ్య తండ్రి ఒడయ్య R/o నంది మేడారం ధర్మారం మండలం పెద్దపల్లి జిల్లా, ప్రస్తుతం ధర్మారం గ్రామ మిషన్ భగీరథ వాటర్ స్కీం పై హెల్పరుగా పనిచేస్తున్నాను అని తనకు చిన్నప్పటి నుంచి మావోయిస్టు విప్లవభావాలకు ఆకర్షితుడే చిన్న వయసులోని అందాజ 12 నుంచి 13 సంవత్సరాలు దేవుని కమాండర్ గా గల పెద్దపల్లి దళం నందు పనిచేసి పెళ్లి చేసుకున్న తర్వాత దుమ్మాటి అర్జున్ @ నాగన్న అతని భార్య నిర్మల కమాండర్ గా ఉన్న పెద్ద పెళ్లి దళంలో చేరానని అట్టి పెద్ద పెళ్లి దళంలోని కంకణాల రాజిరెడ్డి @ వెంకటేష్ కూడా పనిచేసేవాడని అతనితో తనకు పరిచయం ఏర్పడిందని ఆరు నెలలు పని చేశాక పాత వరంగల్ మరియు కరీంనగర్ జిల్లాకు సంబంధించిన ప్రొటెక్షన్ ప్లాటూన్లో కమాండర్ జగన్ వద్ద చేరినారని ఇట్టి ప్రొటెక్షన్ కమిటీ లాంటి ముఖ్యమైన లీడర్స్ రక్షణ కల్పిస్తూ అదేవిధంగా వారికి వివిధ ప్రాంతాలకు తరలించుటకు ఉపయోగపడే వాడని దళ మెంబర్ గా పనిచేసినప్పుడు 12 బోర్ రైఫిల్ ఇచ్చినట్లు తెలిపినాడు. నవంబర్ 2002 సంవత్సరంలో లొంగిపోయి ధర్మారం నందు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో ఇల్లు కట్టుకొని వ్యవసాయం చేస్తూ నివసిస్తున్నాను. అట్టి భూమిలో ఎలాంటి పంటలు పండక తనకు ఆర్థికపరమైన సమస్యలు ఏర్పడిన కుటుంబ పోషణకు ఇబ్బంది కావడంతో ఈ సమస్యలు భరించలేక పాతకాలం నాటి నిషేధిత మావోయిస్టు పార్టీ ఉద్యమ భావాలు గుర్తు తెచ్చుకుని ఎలాగైనా నిషేధిత మావోయిస్టు పార్టీలో కలవాలని పార్టీ కోసం పనిచేయాలని నిర్ణయించుకొని సుమారు నాలుగు నెలల క్రితం నుండి నిషేధిత మావోయిస్టు పార్టీలో ప్రస్తుతం పనిచేయుచున్న గతములో తనకు పరిచయం ఉన్న కంకణాల రాజిరెడ్డి @ వెంకటేష్ తనకు ఫోన్ చేసి మాట్లాడి ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లాలో పరిస్థితిల గురించి అడిగి పార్టీకి పనిచేయడానికి నిషేధిత మావోయిస్టు పార్టీ కోసం తనను అడగగా తాను కూడా రాజిరెడ్డి మాటలకు ఆకర్షితుదినై ప్రస్తుత ఆర్థిక సమస్యను దృష్టిలో ఉంచుకొని పార్టీని బలోపేతం చేయుటకు వారితో పని చేయటకుఒప్పుకున్నానని తెలిపినాడు. అప్పటినుండి నాకు కంకణాల రాజిరెడ్డి గుర్తు తెలియని వ్యక్తుల ద్వారా నిషేధిత మావోయిస్టు పార్టీ ఉద్యమ స్ఫూర్తిగా సాహిత్యం కరపత్రాలు మరియు మందుగుండు సామాగ్రి పంపించినాడు. అతని ఆదేశాల మేరకు నిషేధిత మావోయిస్టు పార్టీ కోసం కొత్తగా రిక్రూమెంట్ కొరకు నాకు తెలిసిన కొంతమందిని పార్టీ భావజాలాలు ఉన్న వ్యక్తులను ప్రోత్సహించే పార్టీ కోసం పని చేయాలని తెలియజేయగా వారు కూడా ఆకర్షిత పనిచేయడానికి సిద్ధమైనారు మంగళవారం ఉదయం 7గంటలకి మా గ్రామం నుండి ద్విచక్ర వాహనంపై కంకణాల రాజిరెడ్డి ఆదేశాల మేరకు తన వద్ద ఉన్న సామాగ్రి కరపత్రాలు తీసుకొని అతనిని కలవడానికి తెలంగాణ మరియు చత్తీస్గడ్ సరిహద్దుకు వెళుతూ ఇంతకు ముందు ఇక్కడికి రాగా మీరు కనిపించగా మీ నుంచి తప్పించుకొని పరిపోవుటకు ప్రయత్నిన్చినానని చెప్పినాడు. అతని వద్ద తనిఖి చేయగా నిషేధిత మావోయిస్టు పార్టీ కి చెందిన విప్లవ సాహిత్యం, ఆరు కరపత్రాలు మందు ఉండే సామాగ్రి నాలుగు, జిలెటిన్స్ స్టిక్స్ , నాలుగు డిటోనేటర్స్ దొరికినవి, వెంటనే వాటిని మరియు మొబైల్ ఫోన్, కవాసకి కంపెనీకి చెందిన బాక్సర్ బైక్ పంచుల సమక్షంలో స్వాధీనపరుచుకోవడం అయినది.

Post A Comment: