మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలం బసంతనగర్ కేశోరం సిమెంటు కర్మాగారంలో ఈరోజు ఈశాల తక్కల్లపల్లి గ్రామానికి చెందిన రడం పరశురామ్ విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ఎత్తు పైనుండి కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్*హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మృతుని కుటుంబాన్ని పరామర్శించారు అనంతరం మృతుని కుటుంబానికి నష్టపరిహారం 40లక్షలు ఇవ్వాలని అలాగే కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మృతదేహంతో కంపనీ గేట్ ముందు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పెద్ద ఎత్తున కార్మికులతో ధర్నా నిర్వహించారు.

Post A Comment: