మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలంలోని క్రింది అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కలెక్టర్ కు విజ్ఞప్తి చేసిన ఎంపీపీ రాణిబాయి రామారావు..మహాదేవపూర్ గోదావరి నది తీరంలో విద్యుత్ దహన వాటిక ఏర్పాటుకు 20 లక్షలు,
2.మహాదేవపూర్ ఏరియా ఆస్పత్రి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 10 లక్షలు, 3.మహాదేవపూర్ ఏరియా ఆస్పత్రి లో రోగుల వెంట వచ్చే కుటుంబ సభ్యులు రెస్ట్ తీసుకోవడానికి,వంట చేసుకోవడానికి రెండు ప్రత్యేక గదులు నిర్మించేందుకు10 లక్షలు,
4.మహాదేవపూర్ గ్రంధాలయ భవన నిర్మాణానికి 20 లక్షలు,
5.అంబట్ పల్లి పి హెచ్ సి ఆసుపత్రి కాంపౌండ్ వాల్ నిర్మాణం కోసం 5 లక్షలు,
6.మండల కార్యాలయ కాంప్లెక్స్ లో సులబ్ కాంప్లెక్స్ నిర్మాణానికి 10 లక్షలు ( లేడీస్&జంట్స్ కు వేరువేరుగా),
7.మండల కార్యాలయ కాంప్లెక్స్ లో పార్క్ నిర్మాణానికి 5 లక్షలు,
8.మహాదేవపూర్ జెడ్పిహెచ్ ఎస్ బాలుర స్కూల్ లో అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 10 లక్షలు ( రెండు గదులు),
9.మహదేవపూర్ జెడ్పిహెచ్ ఎస్ బాలికల స్కూల్ లో రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం కోసం 10 లక్షలు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు..

Post A Comment: