మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఈరోజు లింగాపూర్ గ్రామంలో మినరల్ వాటర్ ప్లాంట్ మంచినీటి పారిశుద్ధ కేంద్రం నిర్మించాలని ఎన్ టి పి సి-సి.ఎస్.ఆర్, డీజీఎం-హెచ్.ఆర్. త్రివేదియా ను కలవడం జరిగింది. ఎన్టిపిసి నిర్మాణానికి లింగాపూర్ గ్రామ రైతులు తమ పంట భూములను ఇచ్చారని మాది ఎన్టిపిసి ప్రభావిత గ్రామం కాబట్టి ఎన్టిపిసి సంస్థ ద్వారా లింగాపూర్ గ్రామానికి ఎన్నో అభివృద్ధి పనులు చేయాల్సి ఉన్నప్పటికీ సంస్థ పట్టించుకోవడంలేదని కనీస మౌలిక వసతులు గాని అభివృద్ధి పనులు గాని చేయడం లేదని ఇకనైనా సిఎస్ఆర్ నిధులతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రతి మూడు నెలలకొకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని ముఖ్యంగా గ్రామ ప్రజలు మంచినీటి సదుపాయం లేక అనారోగ్యాల బారిన పడుతూ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాబట్టి కనీసం వెంటనే మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి లింగాపూర్ గ్రామ ప్రజలను ఆదుకోవాలని ఈ సందర్భంగా డిజిఎం హెచ్ఆర్ త్రివేదియను బీజేపీ నాయకుడు నిమ్మరాజుల రవి కోరడం జరిగింది.లేని పక్షంలో ప్రజలతో వెళ్లి కలెక్టర్ ను కలుస్తామని ఆందోళనలు కూడా చేపాడతామని అన్నారు. దానికి ఎన్ టి పి సి డిజిఎం సానుకూలంగా స్పందిస్తూ త్వరలోనే నిర్ణయం తీసుకొని గ్రామపంచాయతీ తీర్మానం కోరతామని వారు తెలియజేశారు డీజీఎం గారిని కలిసిన వారిలో గోదావరి ఏరియా ntpc కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి రాధారపు రాజ మల్లయ్య, పులి శ్రీనివాస్, కన్నం మోహన్ ఉన్నారు.

Post A Comment: