మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను, చట్టాలను ద్వంశం చేస్తూ కార్పొరేట్ దాహానికి కార్మికులను బలిచేస్తుందని సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.సాయిబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

సీఐటీయూ జిల్లా 3వ మహాసభలు ntpc జ్యోతినగర్ లోని T.V. గార్డెన్ లో ప్రారంభం అయ్యాయి.ఈ సందర్బంగా ntpc గేట్ నుండి టీవీ గార్డెన్ వరకు భారీ కార్మిక ప్రదర్శన  అనంతరం బహిరంగ సభ లో ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి నుండి దాని సైద్ధాంతిక విభాగం అయిన rss కనుసన్నల్లో నడుస్తూ దేశంలో విచ్చిన్నకర మతోన్మాద ఎజెండాను కొనసాగిస్తోందని అన్నారు.నైతిక,రాజకీయ విలువలను తుంగలో తొక్కుతూ అప్రజాస్వామిక పద్ధతుల్లో అధికారానికి నిలబెట్టుకోవడానికి ఎంతకైనా దిగజారుతుందని అన్నారు.కార్పొరేట్ గుత్తపెట్టుబడి దారులకు దేశ సంపదను దోచిపెడ్తూ తన అధికారాన్ని సుస్థిరపర్చుకునెందుకు కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం యావత్ దేశాన్నే అమ్మకానికి పెట్టిందని ఆరోపించారు.ఈ క్రమంలో కార్మికులను కార్పొరేట్ శక్తులకు కట్టుబానిసలుగా మార్చుతుందని అందుకోసం పుట్టుకొచ్చినవే లేబర్ కోడ్ లని అన్నారు.నూతన కార్మిక చట్టాల్లో యాజమాన్యాల సంక్షేమం కార్మికుల సంక్షోభం ఉందని అన్నారు.ఈ చట్టాలవల్ల కార్మికుడు కనీస జీతం అడిగే హక్కు,సమ్మె చేసే హక్కు లాంటి ఎన్నో కోల్పోతున్నారు అన్నారు. దేశంలో ఇప్పటికి రోజురోజుకు ఆకలి చావులు పెరుగుతుంటే ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్రం జాతి సంపద రైల్వే, బొగ్గు, విమానం,బీమా సంస్థలు,బ్యాంక్ లు లాటివి ప్రయివేటికరణ చేస్తూ చౌకగా కార్పొరేట్ పెట్టుబడిదారులకు అమ్ముతోందని అన్నారు.చివరికి దేశ రక్షణ రంగంలో కూడా ప్రయివేటు పెట్టుబలను ఆహ్వానిస్తోంది అన్నారు.మాటిమాటికి దేశభక్తి అనే బీజేపీ కరోన సమయంలో దేశ ప్రజలు పిట్టల్లా రాలుతున్న కనీస సహాయం అందించలేదని లక్షలాది మంది ఉపాధి కోల్పోయి ఇప్పటివరకు కొలుకోలేదని అన్నారు.నష్ట పోయిన వారిని అదుకోకుండా  లక్షల కోట్లను తన్నుకుపోయిన బడా బాబులకు వేలకోట్ల ఋణ మాపి లు చేసి దేశ భక్తి అంటు ఉరేగుతుందని అన్నారు.అది నిజమైన దేశ భక్తి కాదని అది దేశ ద్రోహం అవుతుందని ఆగ్రహం వ్యక్తంచేశారు.దేశానికి అన్నం పెట్టే రైతు,కార్మికులను మాత్రం తన నియంతృత్వ విధానాలతో నాశనం చేస్తుందని అన్నారు.అధికార దాహంతో రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య ప్రభుత్వాలను కూల్చడానికి ప్రయత్నిచడం బీజేపీ కుటిల నీతి బట్టబయలు చేస్తుందని అన్నారు.దేశంలో మతోన్మాదం ,మహిళలు, చిన్న పిల్లలపై అరాచకాలు జరుగుతున్న దేశ ప్రధానికి అవేంపట్టవని వారి రక్షణకు మాత్రం ఏ చట్టాలు తీసుకురారని ఎద్దవా చేశారు ప్రశ్నించే గొంతులను మాత్రం నామరూపాలు లేకుండా చేసే విధానాలు అవలభిస్తున్నారని అన్నారు.ఎన్నికల సమయంలో దేశ భక్తి పేర బాగోద్వేషాలను రెచ్చగొడుతూ,ప్రశ్నించిన వారిపై రాజ్యాంగ సంస్థల పేర దాడులు చేస్తూ ప్రజలను మోసం చేసి అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతకైనా తెగిస్తుందని అన్నారు.మేకిన్ ఇండియా, మెడిన్ ఇండియా నినాధాలుగానే మిగిలాయని, యువత ఉద్యోగాలు లేక ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చూస్తూ ఆనందిస్తుందని అన్నారు.తన రాజకీయ ఎజెండా అమలుకు అడ్డు వచ్చే  ప్రజాస్వామ్య,రాజ్యాంగ వ్యవస్థలను పూర్తిగా ధ్వంసం చేయ పూనుకుందని అన్నారు.ఇలాంటి విధ్వంసకర విధానాలకు భవిష్యత్తులో కార్మికవర్గపోరాటలే సరైన గుణపాఠం చెప్తాయని హెచ్చరించారు.

  అదే దారిలో రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయని అన్నారు. మీదికి చూడ కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే కేసీఆర్ రాష్ట్రంలో ఎక్కడ ప్రత్యామ్నాయ విధానాలను అమలు చేయడం లేదని అన్నారు.గత 8 ఏండ్లుగా పెండింగులో ఉన్న 73 శడ్యూల్డ్ పరిశ్రమల జీఓ లను గెజిట్ చేసి అమలు చేయకుండా కార్మికుల పొట్టను కొడ్తున్నారని అన్నారు.ధరణి వెబ్సైట్ వల్ల అనేక మంది రైతులు ఆందోళన చెందుతున్నారని వాటిని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కనీస వేతనాలు ఇవ్వకుండా అనేక రంగాల కార్మికులు ఆందోళ బాట పడుతుంటే వారి సమస్యలు పరిష్కరించడం లేదని అన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుకు పూనుకోవాలని అన్నారు.అర్హులైన అందరికి డబుల్ బెడ్రూలు కట్టించి ఇవ్వాలని, భూమి ఉన్న పేదలకు 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అన్నారు.కేంద్రం రాష్టంలో బొగ్గు గనులు అమ్ముతుంటే ధీటుగా రాష్ట్ర ప్రభుత్వం తిప్పికొడడంలో విఫలం అవుతుందని అన్నారు.రాష్ట్రంలో కేసీఆర్ కేంద్రం విధానాలు తిప్పికొడ్తూ ప్రజా,కార్మికమోద విధానాలు అమలు చేసి తన విజ్ఞతను చాటాలని పేర్కొన్నారు.

  ఈ కార్యక్రమంలో సబాధ్యక్షులు వేల్పుల కుమారస్వామి అతిధులు citu రాష్ట్ర కార్యదర్శి భూపాల్,బి.మధు,sceu రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజిరెడ్డి,citu జిల్లా కార్యదర్శి ఎర్రవెల్లి ముత్యంరావు ఆహ్వాన సంఘం గౌరవాధ్యక్షుడు ఎన్. భిక్షపతి,అధ్యక్షుడు నాంశాని శంకర్,కోశాధికారి గిట్ల లక్ష్మారెడ్డి,జిల్లా నాయకత్వం జి.జ్యోతి,యం. రామాచారి,మెండే శ్రీనివాస్,డి.కొమురయ్య,బి.వనజా రాణి,బత్తిని సంతోష్,తాండ్ర అంజయ్య మరియు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: