జిల్లా గ్రంధాలయ చైర్మన్ గా బుర్ర రమేష్.... పట్టుదల కృషి అంకితభావం నమ్మకం ఉంటే ఏదైనా వరిస్తుందని నిరూపించారు భూపాలపల్లికి చెందిన బుర్ర రమేష్ గౌడ్, తన రాజకీయ అనుభవంతో నాటినుండి నేటి వరకు ఎవరిని నొప్పించకుండా ఎవరినుండి ఆరోపణలు ఎదుర్కోకుండా రాజకీయ రంగంలో ముందుకు సాగుతున్న వ్యక్తి బుర్ర రమేష్ గౌడ్, నమ్మకానికి ప్రతీకగా ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఆశీస్సులతో ముందుకు సాగుతున్న రమేష్ గౌడ్, ఎదుగుతున్న కొద్దీ ఒదిగి ఉండాలన్న ఆ సూత్రాన్ని పాటిస్తూ సమాజం కీర్తించే విధంగా ఆయన ముందుకు సాగుతున్నారు. నాడైనా నేడైనా ఏ పార్టీలో ఉన్నా గానీ ఆ పార్టీకి అంకితభావంతో పనిచేస్తూ పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్నీ తానై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన వ్యక్తి బుర్ర రమేష్ గౌడ్, తాను నమ్మిన ఆరాధ్యదైవం గండ్ర అంటూ ఆయనకు వెన్నంటి ఉంటూ పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేస్తున్నారు. ఇటీవల పేద విద్యార్థినీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించి వారి విజయానికి తన వంతు కృషి చేశారు రమేష్ గౌడ్, తెరాస పార్టీలో జిల్లా నాయకులుగా కొనసాగుతూ అనేకమందికి ఆదర్శంగా నిలిచి వివిధ పార్టీలకు చెందిన వారిని తెరాస పార్టీలోకి స్వాగతం పలికిన వ్యక్తి రమేష్ గౌడ్,భూపాలపల్లి పట్టణం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్దిని ప్రజలకు తెలియజేయడం కోసం ఆయన కృషి వర్ణనాతీతం. ఈ మేరకు నియామక పత్రాన్ని అందించిన గండ్ర దంపతులకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గ్రంధాలయ కమిటీ చైర్మన్ గా బుర్ర రమేష్ ని నియమించినందుకు రాష్ట్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర వెంకటరమణా రెడ్డి గారికి ఆయన అభిమానులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వం జారి చేసిన నియామక పత్రాన్ని ఈ రోజు హైదరాబాద్ లోని భూపాలపల్లి శాసనసభ్యులు గారి నివాసంలో బుర్ర రమేష్ గారికి అందించిన భూపాలపల్లి గండ్ర వెంకట రమణా రెడ్డి, మరియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెరాస పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి రెడ్డి. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి గౌడ సోదరుడు రమేష్ గౌడ్ అభిమానులు తదితరులు రమేష్ గౌడ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.

Post A Comment: