మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
జయశంకర్ భూపాలపల్లి జిల్లా,మహాదేవపూర్: మండలములోని, చండుపల్లి,అన్నారం, మద్దులపల్లి,పలుగుల, సూరారం,పెద్ద౦పేట్, రాపెళ్ళికోట,ఎన్కపల్లి గ్రామపంచాయతీలలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చే నూతనంగా జారీ చేసిన ఆసరా పెన్షన్లకు సంబంధించిన పత్రాలను పాతవాటిని,కొత్తవాటిని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు రాణి బాయి రామారావు,ఎంపీడీవో శంకర్,లబ్దిదారులకు అందజేసి,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహదేవపూర్ మండలంలో వృద్దాప్య 717,వితంతు 80, వికలాంగులు 21,సి౦గిల్ ఉమన్ 2,మొత్తం 820 పెన్షన్లు మ౦జూరి అయినవి అని,ఇంకా అర్హతకలవారు ఎవరైనా ఉన్నచో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. పెన్షన్స్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో సంబంధిత గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు,పంచాయతీ కార్యదర్శులు,ఉపాదిహామి ఏ.పి.ఓ తదితరులు పాల్గొన్నారు.మండలంలోని 18 గ్రామపంచాయతీలలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ పత్రాలు గతంలో మంజూర్ అయినవారికి,కొత్తవారికి అందజేయడం ఈరోజుతో పూర్తయినట్లు ఎంపీడీవో శంకర్ తెలిపారు.


Post A Comment: