ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/మాడుగుల శ్రీనివాసశర్మ 

హన్మకొండ ; 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా 

 పలిమేల మండలంలోనీ ముకునూరు, గేర్రాయిగూడెం, ఇచ్చంపల్లి, నీలంపల్లి, సర్వాయిపేట, కామన్ పల్లి సందర్శించిన ఎస్పీ  జె. సురేందర్ రెడ్డి సందర్శించారు.

గోదావరి నది తీరం, తెలంగాణ, మహారాష్ట్ర, చత్తీస్గడ్, సరిహద్దు, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమయిన పలిమేల మండలంలో సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి  జె. సురేందర్ రెడ్డి  పర్యటించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ సురేందర్ రెడ్డి   మాట్లాడుతూ.... విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇటీవల జిల్లాలో మావోయిస్ట్ లు సంచరిస్తున్నట్లు  సమాచారం ఉందని, అటవీ గ్రామాల ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మావోయిస్టులు ప్రలోభాలకు గురిచేసి,  చెడు మార్గం వైపు  నడిచేలా ప్రోత్సహిస్తారని, అలాంటి  ప్రలోభాలకు  లొంగకుండా సమాజ శ్రేయస్సుకు పాటు పడాలని సూచించారు. గ్రామాలలో ఎవరైనా అనుమానాస్పదంగా కొత్త వ్యక్తులు కనిపించిన, పోలిసులకు తెలియచేయాలని ఎస్పి  కోరారు. 

 ప్రజలకు కేవలం శాంతిభద్రతల సమస్య కాకుండా ఇతర సమస్యలున్నా నిర్భయంగా పోలీస్ స్టేషన్ కు వచ్చి తమ సమస్యలు వివరిస్తే  వాటి పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామన్నారు .  యువకులు ప్రజలు మావోయిస్టు కార్యకలాపాలకు దోహదపడి, తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదనీ హితవుపలికారు.  ప్రస్తుతం శాంతియుతంగా ఉన్న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మావోయిస్టుల విప్లవ రాజకీయాలకు, హింసా పూరిత కార్యక్రమాలకు తావులేదన్నారు. మావోయిస్టుల ఆగడాలకు ఉనికికి అడ్డుకట్ట వేయడానికి ప్రజలు, పోలీసులకు సహరించాలని కోరారు. మావోయిస్టుల కదలికల  సమాచారం తెలిస్తే, పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలపాలని,  సమాచారం తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని మరియు వారికి తగిన నగదు బహుమతి ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అంతకు ముందు ఎస్పి  ముకునూరు, పలిమెల లో గుత్తికోయ ప్రజలకు దుప్పట్లు, వారి పిల్లలకు పండ్లు పంపిణీ చేశారు.    ఈ కార్యక్రమంలో మహాదేవ్ పూర్  సీఐ కిరణ్,  పలిమెల, మహాదేవ్ పూర్, ఎస్సైలు అరుణ్ కుమార్, రాజ్ కుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: