మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో *దుబ్బాక ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు*మెమొరండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పాక సంతోష్ మహారాజు మాట్లాడుతూ రాష్ట్రంలోని షెడ్యూల్ క్యాస్ట్ వారికి తీవ్ర అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరించిన కూడా ఇంకా ఎస్సీ గా చలామన్ అవుతూ, తో దళిత బంధు పొందుతూ నిజమైనటువంటి హిందూ ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని. ఒకవేళ ఎస్సీలు క్రైస్తవ మతం స్వీకరిస్తే భారత రాజ్యాంగం ప్రకారం బిసిసిగా కుల దృవీకరణ పత్రాలు అధికార యంత్రాంగం ఇవ్వాలని రాజ్యాంగ కల్పించిన హక్కులను రిజర్వేషన్లను అధికారులే తూట్లు పొడుస్తున్నారని.గ్రామాలలో ఎవరైనా ఎస్సీలు కుల ధ్రువీకరణ కోసం దరఖాస్తు చేసుకుంటే వారి ఇంటికెళ్లి క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాతనే కుల ధ్రువీకరణ పత్రాలు మంజూరు చేసెల అసెంబ్లీలో ఈ అంశాలను లేవలెత్తి వాదన వినిపించాలని ఎస్సీ రిజర్వేషన్ ప్రదర్శన సమితి తరపున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. రాజకీయ నాయకులు మరియు రెవెన్యూ సిబ్బంది భారత రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లపై పూర్తి అవగాహన తో పనిచేయాలని ఒక బాధ్యతగా రాజ్యాంగాన్ని రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భుష్పక సంతోష్ మహారాజ్*కుక్క గంగాప్రసాద్ SCRPS పెద్దపల్లి నియోజకవర్గ ఇన్చార్జి రామగుండం అధ్యక్షులు, జిల్లా ఉపాధ్యక్షులు ఉదయ్ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: