ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ప్రభుత్వ ఉద్యోగికి ఉద్యోగ విరమణ తప్పనిసరి అని జయశంకర్ భూపాలపల్లి జిల్లా అదనపు ఎస్పీ (ఆపరేషన్) బోనాల కిషన్ అన్నారు. శనివారం జిల్లా పోలిసు కార్యాలయంలో పోలిసు శాఖలో విధులు నిర్వర్తిస్తూ ఉద్యోగ విరమణ పొందుతున్న ఎస్సై జి. బాలకిషన్, ఏఎస్సై సారంగపాణి, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ వి. కుమారస్వామి లను అడిషనల్ ఎస్పీ బోనాల కిషన్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ రిటైర్డ్ ఉద్యోగులంతా కుటుంబసభ్యులతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. అలాగే ఆరోగ్యాన్ని నిర్లక్షం చేయవద్దని, ఆర్థిక ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి డిఎస్పీ సంపత్ రావు, రిజర్వు ఇన్స్పెక్టర్లు శ్రీకాంత్, కిరణ్, రత్నం, జిల్లా పోలిసు అధికారుల సంఘం నేత యాదిరెడ్డి, ఉద్యోగ విరమణ పొందిన వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;రానున్న రెండు మూడు రోజుల్లో భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య ఆదేశించారు.
శనివారం జిల్లాలోని వివిధ శాఖల అధికారులతో వర్ష ప్రభావం, తీసుకోవాల్సిన చర్యలపై టెలీ కాన్ఫరెన్స్ ను జిల్లా కలెక్టర్ నిర్వహించారు.
ఈ టెలీ కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ భారీ వర్షాలు కురియనున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తూ అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వర్ష ప్రభావ పరిస్థితులను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. తహసీల్దార్ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ ను ఏర్పాటు చేసి ఆయా ప్రాంతాలలో వర్ష ప్రభావాన్ని ఎప్పటికప్పుడు తెలియజేసేందుకు నియమించాలన్నారు. కల్వర్టులు, లో లెవెల్ కాజ్ వేలు ఉన్నచోట్ల సిబ్బంది ఒకరిని నియమించి ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించి వాటిల్లో నివసిస్తున్న వారిని ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వేరే చోటికి తరలించాలని సూచించారు. పారిశుద్ధ్య సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. తాగునీరు కలుషితం కాకుండా క్లోరినేషన్ చేసి ప్రజలకు అందించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కలెక్టరేట్ లో 24 గంటల పాటు పనిచేసేవిధంగా కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో వర్ష ప్రభావ పరిస్థితి గురించి కంట్రోల్ రూమ్ కు తెలియజేయాలన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసే కంట్రోల్ రూమ్ ను వరంగల్ మహానగర పాలక సంస్థ కంట్రోల్ రూమ్ తో అనుసంధానం చేయాలన్నారు. భారీ వర్షాలు నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా విద్యుత్ శాఖ, పంచాయతీరాజ్, సాగునీటి పారుదల శాఖ, వైద్య ఆరోగ్యశాఖ, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు అప్రపత్తంగా ఉండాలన్నారు. చెరువులు, కుంటల పరిస్థితిని సాగునీటి పారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వర్ష ప్రభావానికి సంబంధించిన సమాచారాన్ని సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు నివేదించాలన్నారు.
ఈ సమావేశంలో జిల్లా ఉన్నతాధికారులతో పాటు, రెవెన్యూ, పంచాయతీరాజ్, వ్యవసాయ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భూపాలపల్లి జిల్లా ఓఎస్డీ (అదనపు ఎస్పీ ఆపరేషన్) గా బోనాల కిషన్ బాధ్యతలు స్వీకరించారు. బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ని కలిసి పుష్పగుచ్ఛం అందించారు. బోనాల కిషన్ 1995 లో ఎస్సై గా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
పరకాలలో ప్రాక్టికల్ ట్రైనింగ్ పూర్తి చేసి శాయంపేట పోలిసు స్టేషన్ లో మొదటి పోస్టింగ్, తర్వాత భూపాలపల్లి, పరకాల, హసన్ పర్తి వంటి మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో పని చేసాడు.
2006లో సీఐగా యాగ్జిలరీ పదోన్నతి పొంది, చిట్యాల, ములుగు, నర్సంపేట, స్టేషన్ ఘనపూర్, హన్మకొండలో విధులు నిర్వర్తించారు.
2019 లో డీఎస్పిగా పదోన్నతి పొంది, కాటారం, వరంగల్ నిజామాబాద్ లలో పనిచేస్తూ ఆగస్టు 2024లో పదోన్నతి పొంది భూపాలపల్లి ఓఎస్డీ (అదనపు ఎస్పి ఆపరేషన్) గా బదిలీపై జిల్లాకు వచ్చారు. ఓఎస్డీ గా ( అదనపు ఎస్పీ ఆపరేషన్ ) గా బాధ్యతలు స్వీకరించిన బోనాల కిషన్ కు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ చారిత్రక వారసత్వ నగరం అని, కాకతీయులు పాలించిన సామ్రాజ్యంగా ఈ నగరానికి ఘనమైన చరిత్ర ఉన్నదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
బుధవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమావేశాన్ని నిర్వహించారు.
జాతీయ గీతాలాపన అనంతరం హనుమకొండ వరంగల్ జిల్లాల అధికారులతో సమావేశం ప్రారంభమైంది.
ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య జిల్లాలో చారిత్రక దేవాలయాలు, ప్రదేశాలు, పార్కులు, స్మార్ట్ సిటీ, జాతీయ రహదారులు, ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, విపత్తుల నిర్వహణ సమయంలో, ఇతరత్రా అంశాల కోసం వినియోగిస్తున్న ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, ప్రతిపాదిక కూరగాయల మార్కెట్, విపత్తుల నిర్వహణ, పారిశుధ్య నిర్వహణ, బయో మైనింగ్ ప్లాంట్, కాళోజీ కళాక్షేత్రం, తదితర అంశాలతో పాటు విద్య, వైద్యం, వ్యవసాయ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్, తదితర శాఖల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర గవర్నర్ కు జిల్లా కలెక్టర్ వివరించారు.
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద జిల్లాకు సంబంధించి విద్య, వైద్య ఆరోగ్య, ఎంజీఎం ఆసుపత్రి, ఐసిడిఎస్, వ్యవసాయ, ఏనుమాముల వ్యవసాయ మార్కెట్, ఇతర శాఖల గురించిన వివరాలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా జిల్లాలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర గవర్నర్ కు వివరించారు.
వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి, శాంతిభద్రతలు, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్ర గవర్నర్ కు వివరించారు.
అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ చారిత్రక నగరమైన వరంగల్ లో అనేక చారిత్రక దేవాలయాలు ఉన్న ప్రాంతం ఇదని పేర్కొన్నారు. చారిత్రక వారసత్వ నగరమైన వరంగల్ మరింత సుస్థిరాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. వ్యవసాయ రంగంలోనూ జిల్లా ముందుండాలన్నారు. పీఎం కుసుమ్ యోజన పథకం ద్వారా సౌర విద్యుత్తు ను వినియోగించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి సాధిస్తుండడం పట్ల తనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల తీరు తనను ఆకట్టుకుందన్నారు. మహిళా స్వయం సహాయక సంఘాల అభివృద్ధి చెందడానికి ఎన్నో సంక్షేమ పథకాలు రాష్ట్రంలో ఉండడం చాలా సంతోషకరమన్నారు. వరంగల్ జిల్లాలో మహిళా స్వయం సహాయక సంఘాలు అభివృద్ధి లో ముందంజలో ఉండడం చాలా సంతోషకరమని పేర్కొన్నారు. మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించాలన్నారు. నగరంలోని ఆస్పత్రులు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయనే విషయం తెలిసి చాలా సంతోషం కలిగిందన్నారు. చారిత్రక వరంగల్ నగరంలో పర్యటించడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చిందని రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు.
సౌర విద్యుత్ విషయం ప్రస్తావన సమయంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత నిస్తూ, రైతులకు ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందని తెలుపగా గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించారు.
సమావేశం అనంతరం రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను రాష్ట్ర రెవెన్యూ,గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శాలువాతో సన్మానించారు.
జాతీయ గీతాలాపన అనంతరం సమావేశం ముగిసింది.
ఈ సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, మండలి వైస్ ఛైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ సిరిసిల్ల రాజయ్య, రాష్ట్ర గవర్నర్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్ర వెంకటేశం, ఎమ్మెల్సీలు బస్వరాజ్ సారయ్య, తీన్మార్ మల్లన్న, వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కె.ఆర్ నాగరాజు, కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రాంరెడ్డి , గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్వినీ తానాజీ వాకడే, అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి, సంధ్యారాణి, హనుమకొండ వరంగల్ జిల్లాల వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ములుగు జిల్లా తొలి సారి పర్యటన లో భాగంగా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ చేరుకున్నారు.
రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్ రమణ, జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర ఎస్పీ డాక్టర్ పి.శబరిష్, డిఎఫ్ఓ రాహుల్ కిషన్ జాదవ్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శ్రీజ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మహేందర్ జీ తదితరులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం జిల్లా ఉన్నత అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రతి నెల నాల్గవ శనివారం దివ్యాంగుల కోసం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణిలో భాగంగా ప్రత్యేక ప్రజావాణిలో (05) దరఖాస్తులు వచ్చినట్లు అందులో (03) దరఖాస్తులు ఉపాధి కల్పన కొరకు (01) దరఖాస్తు అంత్యోదయ కార్డు కొరకు (01) దరఖాస్తు సహాయ ఉపకరణము కొరకు వచ్చాయని , ఆయా దరఖాస్తులను తగు చర్యకోసం సంబందించిన శాఖలకు పంపడం జరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి
బి.రాజమణి తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ పట్టణాన్ని మరో నగరంగా తీర్చిదిద్దడానికి మాస్టర్ ప్లాన్ తక్షణమే సిద్ధం చేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం రోజున డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయం లోని తన కార్యాలయ సమావేశ మందిరంలో కుడా (కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ) అధికారులు, పలు శాఖల అధికారులతో వరంగల్ నగర అభివృద్ధి పై సమీక్షంచారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, హైదరాబాద్ నగరం తర్వాత వరంగల్ పట్టణాన్ని అభివృద్ధి పరచడానికి మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసేందుకు పలు మార్లు సమావేశాలు నిర్వహించడం జరిగి సూచనలు అందించామాని తెలిపారు. గతంలో ఉన్న 2041 మాస్టర్ ప్లాన్ ను 2050 నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని పట్టణాన్ని అభివృద్ధి పనులు చేపట్టుటకు ప్రతి పాదించాలని సూచించారు. ఇందుకు అవసరమైన భూముల సేకరణ చేపట్టాలని అన్నారు. ఇప్పటికే కన్సల్టెంట్లు తయారు చేసిన మాస్టర్ ప్లాన్ లను మంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పరిశీలించి, పలు సూచనలు అందించారు. ఈ సమావేశంలో మున్సిపల్ పరిపాలన ముఖ్య కార్యదర్శి దాన కిషోర్, అశ్విని కమీషనర్ కుడా వైస్ చైర్మన్, గౌతమ్ సిడీఏంఏ, హరిచందన రోడ్లు భవనాలు శాఖ కార్యదర్శి, అజిత్ రెడ్డి కుడా సీపీఓ, కాన్సల్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాలో జన సమర్థ ప్రదేశాల్లో తప్పక సిసి కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్, మెడికల్ కాలేజీ తో పాటు పలు ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పి , అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ సీసీ కెమెరాలతో నేరాల అదుపుతో పాటు, నేరస్తులను గుర్తించేందుకు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో కమండ్ అండ్ కంట్రోల్ ద్వారా 24 గంటలు సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రజలు తమ ఇల్లు ,ఆఫీసు, ముఖ్య కార్యాలయాల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని ఇలా చేయడం ద్వారా భద్రతా, నిఘా పెంచుకోవచ్చని ఎస్పి అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రజల భాగస్వామ్యం అవరమని ఎస్పి పేర్కొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది గంజాయి, మత్తు పదార్థాల అనర్థాలపై జిల్లా పరిధిలోని కళాశాల, పాఠశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే మత్తు పదార్థాల బారి నుంచి కాపాడవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగం సామాజిక సమస్యగా పరిగణించబడుతోందని, ఈ సమస్యను రూపుమాపడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పోలిసు అధికారులు పిలుపునిచ్చారు. గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలిసు అధికారులు హెచ్చరించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నేషనల్ హైవే భూసేకరణలో వేగం పెంచాలని ఆర్ అండ్ బి సెక్రటరీ దాసరి హరిచెందన అన్నారు. బుధవారం డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులను సంబంధించి భూసేకరణ పనుల పురోగతి గురించి అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆర్ అండ్ బి సెక్రటరీ దాసరి హరిచెందన మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని రైతులతో మాట్లాడి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ 1195 మంది రైతుల నుంచి 141 హెక్టేర్ల భూమిని గుర్తించడం జరిగిందని, దీనిలో 118 హెక్టేర్ల భూమి సేకరించి జాతీయ రహదారుల అథారిటీకి ఇవ్వడం జరిగిందని, 23 హెక్టేర్ల భూమికి సంబంధించి కోర్టులో రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. 38 మంది రైతులకు ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ జారీ చేయడమైనద నీ అన్నారు . ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు . నిర్ణయించిన ధరకు రైతులు ఒప్పుకోలేదని , రైతులతో మరొక సారి సమావేశం నిర్వహించి భూసేకరణ పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓ లు వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ అశోక్ కాలనీలో నిర్మించిన గిరిజన కళాశాల బాలుర వసతి గృహాన్ని వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్యత కలిసి బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఈ వసతి గృహంలో 250 మంది బాలురకు వసతి కల్పించబడినది. ఈ వసతి గృహ నిర్మాణ వ్యయం రూపాయలు 2.15 కోట్ల రూపా యలు. ఈ వసతి గృహంతో కలిపి
హనుమకొండ లో 6 గిరిజన వసతి గృహాలు బాలురకు 4 బాలికలకు 2 ఉన్నాయి.
ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ప్రేమలత, స్థానిక కార్పొరేటర్ నల్ల స్వరూప రాణి మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
ప్రభుత్వ ఆసుపత్రులలో డాక్టర్లు, సిబ్బంది బయోమెట్రిక్ యంత్రాల ద్వారా హాజరు నమోదు చేసుకొని ఆ వివరాలను గ్రూపులో అప్డేట్ చేయవలసిందిగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఆసుపత్రులు సూపర్డెంట్ ల ను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆసుపత్రుల నిర్వహణపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఆసుపత్రిలో బెడ్లకు నంబర్లు మరియు వార్డులకు నెంబర్లు వేసి పేషంట్ల వివరాలను ఆసుపత్రి ముందు బోర్డులపై ప్రదర్శించాలని అన్నారు. ప్రతి ఆసుపత్రిలో త్రాగునీరు, శానిటేషన్,విద్యుత్తు, జనరేటర్లు, ప్లంబింగ్ ,డీజిల్ వాడకం, శివరేజి సంబంధించిన రిజిస్టర్ లను నిర్వహించాలని, వాటిని ఆసుపత్రి సూపర్డెంట్లు ప్రతిరోజు లేదా రెండు రోజులకు ఒకసారి తనిఖీ చేయాలని అన్నారు. ఆసుపత్రిలోని వార్డులలో ఉన్న లైట్లు ఫ్యాన్లు ఇతర మరమ్మత్తులు వివరాలను నమోదు చేయాలని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే నిధులు సక్రమంగా వినియోగించాలని, మంజూరైన పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఆసుపత్రిలో రాజీవ్ ఆరోగ్యశ్రీ లో నమోదైన జబ్బుల వివరాల లిస్టులను ఉంచాలని అధికారుల ను ఆదేశించారు. ఆసుపత్రి అభివృద్ధి కమిటీలను ఏర్పాటు చేసి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని అన్నారు,టీ బి ఆసుపత్రి కి అంబులెన్స్ కొరకు ప్రతిపాదన లు పంపించాల్సిందిగా కోరారు. పేషంట్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని వారిని ఓపికతో పరీక్షించాలని సూచించారు. ఆసుపత్రులలో ఏమైనా సమస్యలు ఉంటే తెలుపవలసిందిగా అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి,ఆర్డీవోలు నారాయణ,వెంకటేష్ డిఎంహెచ్వో డాక్టర్ లలిత ఆసుపత్రి సూపర్డెంట్లు,అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;అర్హులకు పోడు భూముల పట్టాలు అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు.
శనివారం రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కోండా సురేఖ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సచివాలయం నుంచి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క
తో కలిసి పోడు భూముల పై జిల్లా కలెక్టర్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సమావేశంలో
జిల్లా కలెక్టరేట్ పి ప్రావీణ్య, డీఎఫ్ఓ లావణ్యతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో అటవీ భూముల విస్తీర్ణం, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ చట్టం, జారీ చేసిన పోడు భూముల పట్టాలు, పెండింగ్లో ఉన్న దరఖాస్తులు మొదలగు వివరాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఉన్నత అధికారులు వివరించారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం 13 డిసెంబర్ 2005 నాటికి సాగు చేస్తున్న గిరిజనులు, లేదా 13 డిసెంబర్ 2005 నాటికి మూడు తరాలపాటు సాగు చేసిన గిరిజనేతరులకు పోడు భూముల పట్టాల పంపిణికి అర్హులని అధికారులు పేర్కొన్నారు. మన రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,30,735 మంది అర్హులను గుర్తించి వారికి 6,69,676 ఎకరాల అటవీ భూమి పట్టాలు పంపిణీ చేశామని తెలిపారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అటవీ, పర్యావరణ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఆమోదించిన ఆర్ఓఎఫ్ఆర్ దరఖాస్తుల పట్టాలు లబ్ధిదారునికి చేరాయో లేదో నివేదిక అందించాలని అధికారులకు సూచించారు.
మన రాష్ట్రంలో ఇప్పటివరకు పంపిణీ చేసిన పోడు పట్టాల వివరాలు, పెండింగ్ ఉన్న దరఖాస్తులు, ప్రస్తుతం క్షేత్ర స్థాయిలో సాగు జరుగుతున్న అటవీ భూముల వివరాలతో కూడిన నివేదిక అటవీశాఖ, గిరిజన శాఖ, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా రూపొందించి సమర్పించాలని మంత్రి ఆదేశించారు.
పోడు భూముల పట్టాల కోసం పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అర్హత ఉంటే వారికి పట్టాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని, సదరు దరఖాస్తును తిరస్కరించే పక్షంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేస్తూ నివేదిక అందించాలని అన్నారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం ప్రకారం గతం నుంచి సాగు చేసుకుంటున్నా అటవీ భూములకు మాత్రమే పట్టాలు అందించాలని, కొత్తగా రాష్ట్రంలో ఇంచ్ అటవీ భూమి కూడా సాగు చేయడానికి వీలు లేదని, అటవీ భూముల సంరక్షణకు అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పకడ్బందీ చర్యలు తీసుకోవాలని, ఎక్కడా నూతన ఆక్రమణలు జరగడానికి వీలులేదని మంత్రి స్పష్టం చేశారు.
ఆర్ఓఎఫ్ఆర్ చట్టం పై ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించాలని, తెలంగాణ రాష్ట్ర గిరిజనులకు, ఆదివాసీలకు మాత్రమే పట్టాలు మంజూరు చేయాలని, వలస వచ్చి నూతనంగా అటవీ ప్రాంతంలో చెట్లు నరికివేత చేయాలని చూస్తే కఠినంగా వ్యవహరించాలని మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి దనసరి అనసూయ సీతక్క మాట్లాడుతూ, గిరిజనులకు అటవీశాఖ వ్యతిరేకం అనే భావన తొలగించే విధంగా పని చేయాలని అన్నారు. కొత్తగా అడవుల నరికివేత జరగకుండా అటవీ శాఖ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, అటవీ భూములు చెట్ల నరికివేత వల్ల కలిగే నష్టాలను విస్తృతంగా ప్రచారం చేయాలని మంత్రి తెలిపారు. అటవీ భూముల్లో స్మగ్లింగ్ జరగకుండా పక్కా నిఘా ఏర్పాటు చెయ్యాలని మంత్రి సీతక్క ఆదేశించారు.
పెండింగ్ పోడు భూముల పట్టా దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని సూచించారు. ఆర్ఓఎఫ్ఆర్ చట్ట ప్రకారం అర్హులందరికీ పట్టాలు అందజేయాలని తెలిపారు.
అటవీ భూముల అనుమతుల కారణంగా గిరిజన, ఆదివాసీ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, రోడ్డు సౌకర్యం, త్రాగు నీరు, ఆసుపత్రి వంటి మౌలిక వసతుల కల్పన పనులకు అటవీ అనుమతులు త్వరగా వచ్చేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధతో చర్యలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
పట్టాలు మంజూరు చేసిన పోడు భూములలో రైతులు పామ్ ఆయిల్, జీడి మామిడి తోటలు మొదలగు లాభదాయక పంటలు సాగు చేసేలా రైతులకు అవసరమైన సహకారాలు, సూచనలు అందించాలని మంత్రి తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ప్రేమలత, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా రూపొందించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.
శనివారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి హైదరాబాద్ సీఈఓ కార్యాలయం నుంచి అదనపు సీఈఓ లోకేష్ కుమార్ తో కలిసి ఒటరు జాబితా సవరణ 2025 పై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ, జనవరి 1, 2025 ప్రామాణికంగా ఓటర్ జాబితా సవరణ 2025 కట్టుదిట్టంగా నిర్వహించాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు.
జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ పై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు.
ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 28 వరకు ప్రీ రివిజన్ నిర్వహించి అక్టోబర్ 29న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేయాలని, నవంబర్ 28, 2024 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని , డిసెంబర్ 24, 2024 లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 6 ,2025 న తుది ఓటరు జాబితా రుపోందించాలని తెలిపారు
ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 18,2024 వరకు బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వారిగా ఇంటింటికి తిరుగుతూ ఓటరు ధృవీకరణ చేపట్టాలని, ఓటరు జాబితాలో అవసరమైన చోట పాత ఫోటోలను తొలగించి ఓటర్ల నూతన ఫోటోలు అప్లోడ్ చేయాలని, జనవరి 1,2025 నాటికి 18 సంవత్సరాలు నిండే ప్రతి ఒక్కరి పేరు ఓటరు జాబితాలో నమోదు చేయాలని అన్నారు.
అక్టోబర్ 19 నుంచి అక్టోబర్ 28 వరకు జనవరి ఒకటి 2025 ప్రామాణికంగా 18 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తూ ముసాయిదా జాబితాన్ని రూపొందించాలని అన్నారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.
మరణించిన ఓటర్ల వివరాలను, శాశ్వతంగా వలస వెళ్లిన ఓటర్ల వివరాలను ఓటర్ జాబితా నుంచి ఫారం 7 ద్వారా తొలగించాలని అన్నారు. 1500 మంది ఓటర్లకు మించి ఉన్న పోలింగ్ కేంద్రాల క్రమబద్ధీకరణ చేయాలని , అవసరమైన చోట నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని అన్నారు.
ఓటర్ జాబితాలో ఉన్న మల్టీ ఎంట్రీలను తొలగించాలని, అదేవిధంగా ఓటర్ కార్డు పై ఉన్న పొరపాట్లు పరిష్కరించాలని కలెక్టర్ లకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న 79 వేల 822 ఫారం 8 దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని సీఈఓ ఆదేశించారు.
ఓటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటరు నమోదు కార్యక్రమానికి సంబంధించి జిల్లాలోని వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అన్నారు .
ఈ వీడియో కాన్ఫిరెన్స్ లో కలెక్టర్ మాట్లాడుతూ 1100 దరఖాస్తులు ఓటరు నమోదుకు పెండింగ్లో ఉన్నాయని, మీరు సూచించిన ఆదేశాలను అనుసరిస్తామని, జిల్లాలో ఓటరు నమోదుకు సంబంధించిన సిబ్బంది అందుబాటులో ఉన్నారని వివరించారు.
ఈ వీడియో కాన్పరెన్సు లో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, రెవెన్యూ డివిజనల్ అధికారులు వెంకటేశ్వర్లు, నారాయణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సీజనల్ వ్యాధుల చికిత్సలో ప్రైవేట్ ఆస్పత్రులు బాధ్యతగా వ్యవహరించాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారి ఆదేశానుసారం సీజనల్ వ్యాధులపై జరిగిన జరిగిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రైవేటు ఆసుపత్రులు జిల్లా వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు జ్వరాలతో వచ్చిన వారికి రాపిడ్ కిట్ ద్వారా డెంగ్యూ పాజిటివ్ వచ్చినట్లయితే దానిని నిర్ధారణ చేసుకోవడానికి ఎంజీఎం లేదా టి- డయాగ్నస్టిక్ హబ్ లలో ఎలీషా పరీక్షకు పంపించాలని అన్నారు.ఒకవేళ ప్రైవేట్ ఆస్పత్రులలో ఎలిసా పరీక్ష అందుబాటులో ఉన్నట్లయితే అక్కడే పరీక్షించి వివరాలను తెలియజేయాలన్నారు. పేషెంట్స్ డెంగ్యూ పాజిటివ్ అనగానే భయానికి లోను అవకుండా వారికి తగిన ధైర్యాన్ని కల్పించాలని అన్నారు.అన్ని ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షల చార్జీలు, బెడ్ చార్జీలు, మందుల ఖరీదు ఎంత అవుతుందనేది ఆసుపత్రులలో చేరే ముందే పేషెంట్స్ కు తెలియజేయాలని, అలాగే చట్ట ప్రకారం అన్ని చార్జీలు వివరాలను అందరికీ కనిపించే విధంగా ప్రదర్శించాలని ఆదేశించారు. తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే వారిని ఆసుపత్రిలో చేర్చుకోవాలని, ఆసుపత్రిలో చేరటం భారంగా పరిగణించకూడదని అన్నారు.
డెంగ్యూ,మలేరియా ఇతర వ్యాధుల వివరాలను ప్రతిరోజు నిర్ణీత ప్రొఫార్మాలో తప్పనిసరిగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గారికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రైవేట్ ఆసుపత్రులకు ఉందన్నారు. పాజిటివ్ కేసుల వివరాలను అన్నింటిని పూర్తి చిరునామాతో తెలియజేస్తే పంచాయతీ,మున్సిపల్ మరియు ఆరోగ్య శాఖ వారు ఆ ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటారని అన్నారు. ప్లేట్లెట్స్ మార్గదర్శకాల ప్రకారం పేషెంట్స్ కు అందించాలని అన్నారు.ఆసుపత్రులలో అందిస్తున్న సేవలు పై ఫిర్యాదులు అందినట్లయితే జిల్లా రాపిడ్ రెస్పాన్స్ టీం వాటిపై విచారించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులలో గుర్తింపు పొందిన చికిత్సల ను ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందించాలని, ఇవి పూర్తిగా ఎలాంటి నగదు చెల్లింపులు లేనటువంటివని పేషంట్ల కు ఇబ్బంది కలిగించోద్దని, వారు డిశ్చార్జ్ అయ్యేంతవరకు ఎలాంటి అదనపు చెల్లింపులు వసూలు చేయవద్దని ప్రైవేట్ ఆసుపత్రులను కోరారు.
ఈ కార్యక్రమంలో డి ఎం హెచ్ ఓ డాక్టర్ లలితాదేవి,అదనపు డిఎంహెచ్వో మదన్ మోహన్ రావు, ఐఎంఏ మరియు ప్రైవేటు ఆసుపత్రి నుండి డాక్టర్ రాకేష్ రెడ్డి, డాక్టర్ బింగి శ్రీనివాస్, పరకాల ఆస్పత్రి సూపర్డెంట్ గౌతమ్ చౌహన్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ;
కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ స్వాతంత్య్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని చాటిచెప్పేలా ఉందని జిల్లా కలెక్టర్ కలెక్టర్ పి.ప్రావీణ్య ఐఏఎస్ ప్రశంసించారు. తెలుగు స్వాతంత్య్ర సమరయోధుల యొక్క అరుదైన చిత్రాల యొక్క ఈ ఎగ్జిబిషన్ నేడు ప్రారంభించిన జిల్లా కలెక్టర్ ప్రదర్శనను తిలకించాలని కోరారు. భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ యొక్క సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్స్ ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ సూరునేని కిషన్ పురాలోని గీతాంజలి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు రోజుల ఫోటో ఎగ్జిబిషన్‌ను జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య ఐఏఎస్ నేడు ప్రారంభించారు. అనంతరం తెలుగు స్వాత్రంత్య సమరయోధుల యొక్క అరుదైన చిత్రాలను వీక్షించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పి.ప్రావీణ్య పాల్గొన్నారు. ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ ఆధ్వర్యంలోని నిర్వహించిన వాల్ పేయింటింగ్, వ్యాసరచన పోటీలతో పాటుగా గ్రూప్ డ్యాన్స్, సోలో డ్యాన్స్ సహా ఇతర పోటీల విజేతలకు బహుమతులు మరియు సర్టిఫికేట్ల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులైన ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ ఫోటో ఎగ్జిబిషన్ గురించి వివరిస్తూ, దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన తెలుగు మహనీయుల గురించి నేటి తరానికి వివరించేందుకు ఈ ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పోరాట యోధుల పంథాలో విద్యార్థులు తమలో నూతన స్ఫూర్తిని రగిలించుకొని ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు. హాజరైన వారిని ఉద్దేశించి
జిల్లా కలెక్టర్ కలెక్టర్ పి.ప్రావీణ్య ఐఏఎస్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్య్ర పోరాటంలో జెండా రూపకర్త పింగళి వెంకయ్య మొదలుకొని అనేకమంది స్వేచ్చా వాయువుల కోసం తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. ఆ త్యాగధనుల స్ఫూర్తిని చాటిచెప్పేలా ఫొటో ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నారని ఫీల్డ్ పబ్లిసిటీ అధికారి శ్రీధర్ ను ప్రశంసించారు. నేడు (శుక్రవారం ) సైతం కొనసాగే ఈ ఎగ్జిబిషన్‌ను వీక్షించాలని ఆమె సూచించారు. వివిధ పోటీలలో విజేతలకు అభినందించారు. ఈ సందర్భంగా ఎయిర్ఫోర్స్ ఫస్ట్ ఆఫీసర్ టి.శ్రీనివాస్‌ను కార్యక్రమ నిర్వహకులైన శ్రీధర్ సూరునేని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య చేతుల మీదుగా అభినందించారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కేంద్రం పోలీస్ పరేడ్ మైదానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ దర్మాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్యతిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పోలీసుల గౌరవ వందనం స్వీకరించి పుర ప్రముఖులను, స్వాతంత్య్ర సమరయోధులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన అధికారులు, ఉద్యోగులకు అందించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తిలకించి వివరాలను తెలుసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్థులు దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి, జిల్లా కలెక్టర్, పోలీసు కమీషనర్, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో వరంగల్ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య, వరంగల్లు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు రాజేందర్ రెడ్డి, నగర మేయర్ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య, పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, నగర పాలక సంస్థ కమిషనర్ అశ్వనీతానాజీ వాకాడే ,అదనపు కలెక్టర్ వెంకట్ రెడ్డి, స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.
పెద్దపల్లి,గోదావరిఖని,ఆగస్టు,7,మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్,కళాక్షేత్రాల ద్వారా జానపద భజనలు నృత్యాలు కోలాటాలు కూచిపూడి భరతనాట్యాలు ద్వారా భారత సంస్కృతి పెంపొందించాలి, రాజారామ్ స్మారకార్ధం కూతురు గీత నిర్వహించిన కార్యక్రమానికి పీఠాధిపతి హాజరై అతని చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,సాంస్కృతిక కళలు ప్రవచనాలు బోధించారు,అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ విజయశంకర స్వామి,హిందూస్ ఫర్ ప్లూరాలిటీ అండ్ ఈక్వాలిటీ(హెచ్ పిఈ)నాయకులు,ఖదిజ్ఞాసి మల్లికావల్లభ,ఆధ్యాత్మిక అన్వేషకులు,బివి రెడ్డి,తిరుపతి తిరుమల అన్నమయ్య గృహ సాధన సమితి మరియు జై భారత్ నాయకులు అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి శ్రీ శ్రీ విజయ శంకర స్వామి పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని,తిలక్ నగర్ లోని ఫంక్షన్ హాల్లో రేవల్లే రాజారాం స్మారిక అర్థం అతని కూతురు గీత నిర్వహించిన కార్యక్రమానికి మంగళవారం రాత్రి అన్నమయ్య కలక్షత్ర పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయ శంకర స్వామి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు,ఈ సందర్భంగా వారు మాట్లాడురు,సంస్కృతి కలలు సాంప్రదాయం సన్నగిల్లుతున్న ఈ తరుణంలో కళాక్షేత్రాల ద్వారా జానపద భజనలు,కోలాటాలు,వివిధ కళ భారత సంస్కృతి పెంపొందించే ఈ దేశంలో గ్రామ గ్రామాన కళాక్షేత్రాలు నెలకొల్పాలని ఇప్పటికే ఐదు ఆరు రాష్ట్రాలలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని,విధంగా ముందుకు సాగాలని వారి పిలుపునిచ్చారు,అంతకుముందు రేవెల్లి రాజా రామ్ కూతురు గీత పలువురిని మెమోటోలు,శాలువాలతో ఘనంగా సత్కరించరు,ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కోరుకొండ చందర్,కళాకారులు జనగామ రాయనర్స్,పద్మ,రమ అనుమాండ్ల మధుకర్,అడుకపురం రాజేష్,ఎన్ అశోక్,రాకన్ సంతోష్,అనూజు వెంకటేష్,మ్యాజిక్ రాజా.గోదావరిఖని కళాసమైక్య రమణ,తదితరులు పాల్గొన్నారు..