ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
నేషనల్ హైవే భూసేకరణలో వేగం పెంచాలని ఆర్ అండ్ బి సెక్రటరీ దాసరి హరిచెందన అన్నారు. బుధవారం డా. బిఆర్ అంబేద్కర్ సచివాలయం నుండి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణ పనులను సంబంధించి భూసేకరణ పనుల పురోగతి గురించి అటవీ పర్యావరణ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ తో కలిసి సంబంధిత జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విడియో కాన్ఫరెన్స్ కు ఐడిఓసి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య పాల్గొన్నారు. ఈ కాన్ఫరెన్స్ లో ఆర్ అండ్ బి సెక్రటరీ దాసరి హరిచెందన మాట్లాడుతూ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని రైతులతో మాట్లాడి వారి న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆదేశించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య మాట్లాడుతూ
గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూసేకరణ 1195 మంది రైతుల నుంచి 141 హెక్టేర్ల భూమిని గుర్తించడం జరిగిందని, దీనిలో 118 హెక్టేర్ల భూమి సేకరించి జాతీయ రహదారుల అథారిటీకి ఇవ్వడం జరిగిందని, 23 హెక్టేర్ల భూమికి సంబంధించి కోర్టులో రెండు కేసులు ఉన్నాయని తెలిపారు. 38 మంది రైతులకు ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ జారీ చేయడమైనద నీ అన్నారు . ఇప్పటి వరకు భూసేకరణకు సంబంధించి రైతులతో పలుమార్లు సమావేశాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు . నిర్ణయించిన ధరకు రైతులు ఒప్పుకోలేదని , రైతులతో మరొక సారి సమావేశం నిర్వహించి భూసేకరణ పనులను పూర్తి చేస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, ఆర్డిఓ లు వెంకటేశ్వర్లు, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: