ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది గంజాయి, మత్తు పదార్థాల అనర్థాలపై జిల్లా పరిధిలోని కళాశాల, పాఠశాల విద్యార్థులకు బుధవారం అవగాహన కల్పించారు. ఈ సందర్బంగా చెడు వ్యసనాలకు అలవాటు పడిన వారిని ప్రాథమిక స్థాయిలో గుర్తిస్తే మత్తు పదార్థాల బారి నుంచి కాపాడవచ్చన్నారు. మత్తు పదార్థాల వినియోగం సామాజిక సమస్యగా పరిగణించబడుతోందని, ఈ సమస్యను రూపుమాపడానికి అన్ని వర్గాల ప్రజలు ముందుకు రావాలని పోలిసు అధికారులు పిలుపునిచ్చారు. గంజాయి లేదా మత్తు పదార్థాల విక్రయాలు, రవాణా, వినియోగం లాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలిసు అధికారులు హెచ్చరించారు.
Post A Comment: