ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ 



హన్మకొండ ;

 హనుమకొండ జిల్లా కేంద్రం పోలీస్‌ పరేడ్‌ మైదానంలో గురువారం 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర పర్యావరణ, అటవీ, దేవాదాయ దర్మాదాయ శాఖ మంత్రి  కొండ సురేఖ ముఖ్యతిగా  విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  అంతకుముందు మంత్రి పోలీసుల  గౌరవ వందనం స్వీకరించి  పుర ప్రముఖులను, స్వాతంత్య్ర సమరయోధులను, అధికార అనధికారులను కలిసి స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతి నివేదికను వివరిస్తూ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.  ఉత్తమ సేవలు అందించిన అధికారులు,  ఉద్యోగులకు  అందించారు. అనంతరం వివిధ శాఖల ద్వారా అమలవుతున్న కార్యక్రమాలు, సాధించిన ప్రగతిని తెలిపేలా ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను మంత్రి తిలకించి వివరాలను తెలుసుకున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆహుతులను అలరింపజేశాయి. పాఠశాలల విద్యార్ధినీ, విద్యార్థులు దేశ భక్తిని నింపుకుని జాతీయ స్ఫూర్తి పెంపొందేలా ఆకట్టుకునే రీతిలో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించి ఆహుతుల మన్ననలు అందుకున్నారు. ఈ సందర్భంగా చిన్నారులను ముఖ్య అతిథి మంత్రి, జిల్లా కలెక్టర్‌, పోలీసు కమీషనర్‌, జిల్లా ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ వేడుకల్లో వరంగల్‌ పార్లమెంటు సభ్యులు కడియం కావ్య,  వరంగల్లు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు రాజేందర్‌ రెడ్డి, నగర మేయర్‌ గుండు సుధారాణి జిల్లా కలెక్టర్‌  పి.ప్రావిణ్య, పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిషోర్‌ ఝా,  నగర పాలక సంస్థ కమిషనర్‌ అశ్వనీతానాజీ వాకాడే ,అదనపు కలెక్టర్‌ వెంకట్‌ రెడ్డి,  స్థానిక ప్రజాప్రతినిధులు, అన్ని శాఖలకు చెందిన జిల్లా అధికారులు, సిబ్బంది, స్వాతంత్య్ర సమరయోధులు, ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు తదితరులు వేడుకల్లో పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: