వరంగల్: నగర పరిధిలోని గొర్రెకుంట 15వ డివిజన్ బీఆర్ఎస్ గ్రామపార్టీ అధ్యక్షుడు ల్యాదల్ల రాజు (45) ఆదివారం ఉదయం అనుమానాస్పద స్థితిలో మృతిచెందడం జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. మొగిలిచర్ల గ్రామ శివారులోని చెరువు వద్ద రాజు మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తెలుసుకున్న పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. రాజు మృతి వెనుక కారణాలపై వివిధ వాదనలు వినిపిస్తున్నాయి. కుటుంబసభ్యులు రాజు ఇటీవల కొన్ని వ్యక్తులతో వ్యక్తిగత వివాదాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ కోణం కూడా పరిశీలనలోకి తీసుకున్న పోలీసులు, రాజు మొబైల్ ఫోన్ డేటా, సీసీ ఫుటేజ్‌లను పరిశీలిస్తున్నారు. “మరణం వెనుక ఉన్న అన్ని కోణాలను దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు కొనసాగుతుంది,” అని పోలీసులు తెలిపారు. ఈ సంఘటనతో గొర్రెకుంట, మొగిలిచర్ల పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు రాజు మృతిపై విచారం వ్యక్తం చేస్తూ, న్యాయమైన దర్యాప్తు జరగాలని డిమాండ్ చేస్తున్నారు."రాజు పార్టీకి అంకితభావంతో పనిచేసిన నాయకుడు. ఆయన మృతి మాకు తీవ్ర లోటు," అని బీఆర్ఎస్ స్థానిక నాయకులు పేర్కొన్నారు.
(ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో 22 సెప్టెంబర్2025 న జరిగిన బూటకపు ఎన్కౌంటర్లో మృతిచెందిన) మృతదేహం కుటుంబ సభ్యులు ఛత్తీస్గఢ్ నుండి ఈ రోజు 18 అక్టోబర్2025,శనివారం, ఉదయం 6-30,గంటలకు తీగలకుంటపల్లి గ్రామంలోకి ప్రజాసంఘాలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు,వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాస్వామిక వాదులు నివాళులు అర్పించి ఊరేగింపుగా ఇంట్లో కి తీసుకువచ్చారు.నివాళుల తర్వాత మధ్యాహ్నం అంతిమయాత్ర ప్రారంభమై గ్రామపురి వీధులనుండి స్మశానం వరకు సాయంత్రం ఐదు గంటల వరకు జరిగింది శ్రీదేవి అమరుడు ఖాతా రామచంద్రరెడ్డి@వికల్ప్ చివరి చూపు కోసం పౌర ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తలు వివిధ పార్టీల రాజకీయ నాయకులు గ్రామస్తులు అనేక ప్రాంతాల నుంచి వచ్చిన అభిమానులు నాటి తోటి స్నేహితులు అభ్యుదయ విప్లవ రచయిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు
ఉమ్మడి వరంగల్; మాడుగుల శ్రీనివాస శర్మ
హనుమకొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లాకు సంబంధించి కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు రాంపూర్ లోని వీఎమ్ఆర్ పాలిటెక్నిక్ కళాశాల, మడికొండ పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాల కళాశాలను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపునకు ఈ రెండు విద్యాసంస్థల్లో కౌంటింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను కలెక్టర్ పరిశీలించి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డివో రాథోడ్ రమేష్, జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీ రమాకాంత్, జడ్పీ సీఈవో రవి, కాజీపేట తహసీల్దార్ భావు సింగ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ హనుమకొండ: సుబేదారిలోని రెడ్ క్రాస్ సొసైటీ సమీపంలో నూతనంగా నిర్మిస్తున్న ఈవీఎం లను భద్రపరిచే గోదాం భవన నిర్మాణ తుది దశ పనులను త్వరగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం సంబంధిత శాఖల అధికారులతో కలిసి భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులను గురించి కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుది దశకు చేరుకున్న పనులను త్వరగా పూర్తి చేసి అప్పగించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట హనుమకొండ ఆర్డిఓ రాథోడ్ రమేష్, ఆర్ అండ్ బి ఈఈ సురేష్ బాబు, హనుమకొండ తహసీల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్;మాడుగుల శ్రీనివాస శర్మ
స్థానిక సంస్థల ఎన్నికలను వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపడుతునట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. సోమవారం హనుమకొండ లోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై హనుమకొండ, జనగామ జిల్లాల కలెక్టర్లు డాక్టర్ సత్య శారద, స్నేహ శబరీష్, రిజ్వాన్ బాషా షేక్, డిసిపిలు, ఏసీపిలు, జిల్లాల అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు చేస్తున్న ఏర్పాట్లు, సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు, చెక్ పోస్టుల ఏర్పాటు, బందోబస్తు, స్ట్రాంగ్ రూమ్ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, ఎన్నికలకు సంబంధించిన వివిధ అంశాలపై పోలీస్ కమిషనర్, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీసీపీలు, జిల్లా పంచాయతీ అధికారులు, జడ్పీ సీఈవోలు, ఆర్డీవోలు, ఏసీపిలతో సమీక్షించారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ హనుమకొండ వరంగల్ జనగామ జిల్లాల్లో స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. పోలీస్ కమిషనరేట్ పరిధిలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామని పేర్కొన్నారు. గత ఎన్నికల నిర్వహణలో అనుసరించిన విధానం, నమోదైన కేసులపై పరిశీలన చేయాలని అధికారులకు, ఏసీపిలకు కమిషనర్ సూచించారు. రూట్ లు, జోన్ల వారిగా మ్యాపులను సిద్ధం చేయాలన్నారు. జిల్లాల సరిహద్దుల్లో చెక్ పోస్టు లను, ఎస్ఎస్టీ బృందాలను ఏర్పాటు చేసి డబ్బు, మద్యం తరలకుండా పటిష్ట చర్యలు చేపట్టాలన్నారు. సమీక్షా సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి చర్చించిన అంశాలలో పోలీస్ శాఖ తరపున చేయాల్సిన అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. రూట్ మ్యాపులను ఎంపీడీవో లు, తహసీల్దార్లు, పోలీస్ అధికారులు సమన్వయంతో సిద్ధం చేయాలన్నారు. జిల్లాలో ఉన్న రెండు రెవెన్యూ డివిజన్ల వారీగా కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. చెక్ పోస్ట్, ఎస్ఎస్ టి బృందాలు తనిఖీలు చేపట్టే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఎంపిటిసి, సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు నియమించు సిబ్బంది, పోలింగ్ కేంద్రాల, రూట్ ల ఏర్పాటు పక్కాగా జరగాలని అధికారులను ఆదేశించారు. జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో అధికారులు సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాలలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించే విధంగా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు.
మండల స్థాయిలో సజావుగా ఎన్నికల నిర్వహణపై సమీక్ష చేసుకోవాలన్నారు. ఎన్నికల నిర్వహణకు అంత సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో డిసిపిలు అంకిత్ కుమార్, రాజమహేంద్ర నాయక్, హనుమకొండ, వరంగల్ జిల్లాల అదనపు కలెక్టర్లు వెంకట్ రెడ్డి సంధ్యారాణి, జడ్పీ సీఈఓ లు రవి, రామ్ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారులు కల్పన, లక్ష్మీ రమాకాంత్, సస్వరూప, ఆర్డిఓ ఉమారాణి, ఇతర అధికారులతో పాటు ఏసీపీలు పాల్గొన్నారు.








