కరీంనగర్ : మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. కొత్తపల్లి మండలం చింతకుంట గురుకులంలో CEC మొదటి సంవత్సరం చదువుతున్న మల్యాల మండలానికి చెందిన అక్షిత (17) పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయని తోటి విద్యార్థులతో ఆవేదన వ్యక్తం చేసింది. రాత్రి 7 గంటలకు స్నేహితులు భోజనానికి వెళ్లిన సమయంలో హాస్టల్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.
మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టేక్మాల్ మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా బోయిని యాదయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గౌరవ అధ్యక్షులుగా ఆనంద్ కుమార్ , ప్రధాన కార్యదర్శిగా కృష్ణ, ఉపాధ్యక్షులుగా సాయిలు, రమేష్ ,కార్యదర్శిగా ప్రేమ్ కుమార్, కోశాధికారిగా యాదాగౌడ్ ,సమాచార కార్యదర్శిగా దుర్గయ్య,
కార్యవర్గ సభ్యులుగా పవన్, సుధాకర్, లింగం,
సలహాదారులుగా రాములు , కొండి శ్రీనివాస్,రాథోడ్ రాజు నాయక్ లు ఎన్నికయ్యారు.ఈ సమావేశంలో మండలంలో 42 మంది విలేకరులు ఉండగా 33 మంది ఈ ఎన్నికలకు హాజరయ్యారు.అనంతరం నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులకు మండల విలేకరులు శాలువాలతో ప్రెస్ క్లబ్ నందు సన్మానం నిర్వహించారు.అనంతరం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు బొయిని యాదయ్య మాట్లాడుతూ విలేకరుల సమస్యలు పరిష్కరించే దిశగా చర్యలు కార్యాచరణ చేపట్టనున్నట్టు త్వరలో దీని పై విలేకరులతో త్వరలోనే సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎమ్మెల్యే తెలియజేశారు. నిరుపేద విద్యార్థుల కోసం నోట్ బుక్స్ ను ఎమ్మెల్యే అందజేశారు. నిరు పేద విద్యార్థుల కోసం నోట్ బుక్స్ ను అందజేసినందుకు ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కి కలెక్టర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్ల, రెడ్ క్రాస్ రాష్ట్ర పాలక మండలి సభ్యులు ఇ. వి. శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గడువులోగా రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు.
మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో జిల్లా నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి అందజేయాల్సిన బియ్యంపై పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లాలోని రైస్ మిలర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొని మాట్లాడుతూ ఖరీఫ్ లో వచ్చిన ధాన్యం నుండి రావాల్సిన బియ్యం పలు మిల్లుల నుండి ఇంకా పెండింగ్ లో ఉందని అన్నారు. పెండింగ్ లో ఉన్న రైస్ మిల్లుల యజమాన్యం గడువులోగా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వసంతలక్ష్మి, డి ఎం మహేందర్, సివిల్ సప్లై డ్యూటీలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు అధికారులు, సిబ్బంది అంతా సమష్టిగా కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.
మంగళవారం జిల్లాకు చెందిన పలువురు అధికారులు కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్ప గుచ్ఛాలు, పూలమొక్కలు, నోట్ బుక్స్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి లో అగ్రభాగంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి కళ్ళు,చెవులు, ఉద్యోగులేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అధికారులదే కీలక పాత్ర అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు.
కలెక్టర్ ను కలిసినవారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా , డిఆర్వో వై. వి. గణేష్, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, పరకాల ఆర్డీవో శ్రీనివాస్, హనుమకొండ తహసిల్దార్ విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఎంవిఐ కంచి వేణు, ట్రెజరీ డిడి రాజు, మెప్మా పీడీ బద్రు నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాంరెడ్డి, పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ హరి ప్రసాద్, సిపిఓ సత్యనారాయణరెడ్డి , డిసిఒ నాగేశ్వర్ రావు, టీజీవో అధ్యక్షులు జగన్మోహన్ రావు, ప్రతినిధులు, టీఎన్జీవో అధ్యక్షులు రాజేందర్, ప్రతినిధులు, కలెక్టరేట్ ఉద్యోగులు, ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ శాఖల ఉద్యోగులు, గురుకుల విద్యాలయాల అధికారులు, విద్యార్థులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, తదితరులు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసు సిబ్బంది పాటు పడాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే సూచించారు. మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలిసు దర్బార్ నిర్వహించి, సిబ్బంది సమస్యలు తెలుసుకుని, ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డిస్ట్రిక్ట్ గార్డ్ సిబ్బంది పరిస్థితులకు అనుగుణంగా వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని, క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు.
జిల్లాలో సంభవించిన వరదల్లో, ఎన్నికల్లో ఇతర బందోబస్తు విధుల్లో డిస్ట్రిక్ట్ గార్డ్ పోలీసుల పనితీరు అభిందనియమని ఎస్పి పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో నూతన సంవత్సరంలో సమర్దవంతంగా పనిచేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఏ. నరేష్ కుమార్, ఏ.అర్ అదనపు ఎస్పీ వి శ్రీనివాస్, ఇనిస్పెక్టర్లు, సూర్య ప్రకాశ్, రాజేశ్వర్ రావు, రత్నం, శ్రీకాంత్, సీసీ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.