ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ 


హన్మకొండ ;

జిల్లాను అభివృద్ధిలో అగ్రభాగాన నిలిపేందుకు  అధికారులు, సిబ్బంది అంతా సమష్టిగా కృషి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు.

మంగళవారం జిల్లాకు చెందిన పలువురు అధికారులు కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ సిక్తా పట్నాయక్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కు పుష్ప గుచ్ఛాలు, పూలమొక్కలు, నోట్ బుక్స్ అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తనను కలిసిన అధికారులు, సిబ్బందికి కలెక్టర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధి లో అగ్రభాగంలో నిలిపేందుకు అధికారులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు అందించేందుకు అధికారులు పారదర్శకంగా పనిచేయాలన్నారు. ప్రభుత్వానికి కళ్ళు,చెవులు, ఉద్యోగులేనని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో అధికారులదే కీలక పాత్ర అని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు.  

కలెక్టర్ ను కలిసినవారిలో అదనపు కలెక్టర్లు రాధిక గుప్తా, మహేందర్ జీ, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధా శుక్లా , డిఆర్వో వై. వి. గణేష్, డిఆర్డిఓ శ్రీనివాస్ కుమార్, పరకాల ఆర్డీవో శ్రీనివాస్, హనుమకొండ తహసిల్దార్ విజయ్ కుమార్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ సాంబశివరావు, రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ పురుషోత్తం, ఎంవిఐ కంచి వేణు, ట్రెజరీ  డిడి  రాజు, మెప్మా పీడీ  బద్రు నాయక్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాంరెడ్డి,  పరిశ్రమల శాఖ జిల్లా మేనేజర్ హరి ప్రసాద్, సిపిఓ సత్యనారాయణరెడ్డి ,  డిసిఒ నాగేశ్వర్ రావు, టీజీవో అధ్యక్షులు జగన్మోహన్ రావు, ప్రతినిధులు, టీఎన్జీవో  అధ్యక్షులు రాజేందర్, ప్రతినిధులు, కలెక్టరేట్ ఉద్యోగులు, ఎక్సైజ్, రెవెన్యూ, పోలీస్ శాఖల ఉద్యోగులు, గురుకుల విద్యాలయాల అధికారులు, విద్యార్థులు, రెడ్ క్రాస్ ప్రతినిధులు, రైస్ మిల్లర్లు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు, తదితరులు కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో ఉన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: