ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు నిర్దేశించిన గడువులోగా రైస్ మిల్లర్లు బియ్యానికి సంబంధించిన లక్ష్యాన్ని పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ జీ అన్నారు.
మంగళవారం హనుమకొండ కలెక్టరేట్ లోని సమావేశపు హాలులో జిల్లా నుంచి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారికి అందజేయాల్సిన బియ్యంపై పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లాలోని రైస్ మిలర్లతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ పాల్గొని మాట్లాడుతూ ఖరీఫ్ లో వచ్చిన ధాన్యం నుండి రావాల్సిన బియ్యం పలు మిల్లుల నుండి ఇంకా పెండింగ్ లో ఉందని అన్నారు. పెండింగ్ లో ఉన్న రైస్ మిల్లుల యజమాన్యం గడువులోగా ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు. ఈ నెల 31వ తేదీలోగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాన్ని పూర్తి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డీఎస్ఓ వసంతలక్ష్మి, డి ఎం మహేందర్, సివిల్ సప్లై డ్యూటీలు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
Post A Comment: