ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి/ మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;పేదల పెన్నిధి సీఎం కేసీఆర్ అని ప్రభుత్వ చీఫ్ విప్, పశ్చిమ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్ అన్నారు. లస్కర్ బజార్ లోని బీసీ స్టడీ సర్కిల్ నందు బీసీ, మైనార్టీ బంధు చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. బీసీ బంధు 250 మంది లబ్దిదారులకు, 80 మంది మైనారిటీ బంధు లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ సర్కార్ పేదల పక్షపాతి అని అన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. గత ప్రభుత్వాలు ఏనాడు పేద ప్రజల గురించి ఆలోచించిన పాపాన పోలేదని విమర్శించారు. బిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాతే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని అన్నారు.
నాడు ఇక్కట్లు నేడు ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు....
ఉమ్మడి రాష్ట్రంలో పింఛన్ల కోసం ప్రజలు ఇక్కట్లు పడేవారని, కానీ పదేండ్ల తెలంగాణ ప్రభుత్వ పాలనలో అర్హులకు నేరుగా పింఛన్లు మంజూరు చేయడం జరిగిందని వివరించారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో 200 ఉన్న పెన్షన్ నేడు తెలంగాణ రాష్ట్రంలో 2000 పెంచుకోవడం జరిగిందని అన్నారు. దివ్యాంగులకు, వితంతువులకు, బీడీ కార్మికులకు, చేనేత కార్మికులకు, కల్లుగీత కార్మికులకు పెన్షన్లను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని అన్నారు. బిజెపి కాంగ్రెస్ పాలిస్తున్న ఏ రాష్ట్రాల్లోనూ 2000 పింఛన్ లేదని అన్నారు. కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బందు, అంటూ అనేక సంక్షేమ కార్యక్రమాలను తీసుకొచ్చిన ఘనత సీఎం కేసీఆర్ కి దక్కుతుందని తెలిపారు.
ఒకవైపు సంక్షేమం మరోవైపు అభివృద్ధి
తెలంగాణలో ఒకవైపు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ మరోవైపు కేసీఆర్ నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. వ్యవసాయ రంగంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో కాలేశ్వరం పాలమూరు రంగారెడ్డి అనేక సాగునీటి ప్రాజెక్టులను నిర్మించడం జరిగిందన్నారు. రైతుల కోసం రైతుబంధు, రైతు బీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయ అధికారుల నియామకం ఇలా అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని వివరించారు. తెలంగాణలో వెయ్యికి పైగా సంక్షేమ కార్యక్రమాల అమలవుతున్నారని అన్నారు. తెలంగాణ వచ్చాకే ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి జరిగింది అని అన్నారు. వేల కోట్ల నిధులతో 9 ఏండ్ల కాలంలో నగర వ్యాప్తంగా సిసి రోడ్లు డ్రైన్లు, అనేక మౌలిక వసతుల కల్పన కృషి చేయడం జరిగిందని తెలిపారు. నగరంలోని అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి తోడుగా ఉండడం జరిగిందని వివరించారు.
అనంతరం లబ్ధిదారులకు చెక్కులను అందించారు. కార్యక్రమంలో మైనార్టీ ఈ డి శ్రీనివాస్, బి సి ఈ డి రాంరెడ్డి, లబ్ధిదారులు, కార్పొరేటర్లు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: