ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
భూపాలపల్లి జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటనలు విజయవంతం చేసేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఆదివారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సమీకృత జిల్లా కలెక్టరేట్ ను సందర్శించి మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ ఉదయం హైదరాబాదు నుంచి హెలికాప్టర్ ద్వారా భూపాల్ పల్లి జిల్లాకు చేరుకుంటారని, సమీకృత కలెక్టరేట్ వద్ద హెలిపాడ్ ను సిద్ధం చేయాలని, మంత్రి కేటీఆర్ పర్యటన ముగిసే వరకు మంత్రి సహాయక బృందానికి, ఇతర ఉన్నతాధికారులకు అవసరమైన వసతి ఏర్పాట్లు కలెక్టరేట్లో కట్టుదిట్టంగా జరగాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
భూపాల్ పల్లి జిల్లాలో 15 ఎకరాల స్థలంలో సమీకృత జిల్లా అధికారుల సముదాయ భవనాన్ని 59 కోట్ల 45 లక్షల వ్యంతో ప్రభుత్వం నిర్మించిందని,4 లిఫ్టులు , 200 కార్ కార్ల పార్కింగ్ సౌకర్యంతో , అన్ని రకాల వసతులతో సమీకృత జిల్లా అధికారుల భవన నిర్మాణం జరిగిందని , జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్ ముందుగా సమీకృత జిల్లా అధికారుల భవనాన్ని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు.
సమీకృత జిల్లా అధికారుల సముదాయ ప్రారంభోత్సవం నేపథ్యంలో శిలాఫలకాన్ని ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయాలని, ముఖ్యఅతిథిక గాడ్ ఆఫ్ హానర్, రిబ్బన్ కటింగ్ వద్ద అవసరమైన వసతులు ముందస్తుగా ఏర్పాటు చేయాలని, కలెక్టర్ ఛాంబర్ వద్ద సర్వ మత ప్రార్థనలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
అనంతరం సమావేశ మందిరం నందు ముఖ్యఅతిథిలచే సమావేశం ఉంటుందని , సమావేశం మందిరం నందు ప్రభుత్వ ఉద్యోగులు సిబ్బంది ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్ డబుల్ బెడ్ రూమ్ భవనం ప్రారంభం ఎస్పీ భువన ప్రారంభం బహిరంగ సభలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు.
బహిరంగ సమావేశం అనంతరం మళ్లీ సమీకృత జిల్లా కలెక్టరేట్ నందు మధ్యాహ్నం భోజనం చేస్తారని, దీనికి అవసరమైన ఏర్పాట్లు కట్టెదటంగా చేయాలని కలెక్టర్ అధికారులకు సూచించారు, మధ్యాహ్న భోజన అనంతరం హెలికాప్టర్ మార్గం ద్వారా మంత్రి కేటీఆర్ పరకాల బయలుదేరుతారని కలెక్టర్ తెలిపారు.
మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అధికారులు వారికి కేటాయించిన విధులను పకడ్బందీగా నిర్వహించి మంత్రి పర్యటనలు విజయవంతం చేయాలని కలెక్టర్ సూచించారు.
ఈ సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Post A Comment: