ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం అంబటిపల్లి శివారు మేడిగడ్డ వద్ద నిర్మించిన లక్ష్మీ బ్యారేజీ వంతెన శనివారం రాత్రి కుంగిపోయింది. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు వంతెనకు ఇరువైపులా బందోబస్తు ఏర్పాటు చేశారు. లక్ష్మీ బ్యారేజీ లోని ఆరవ బ్లాకు 15వ పిల్లల నుండి 21 పిల్లల వద్ద బ్యారేజీ పొంగిపోవడంతో దీనికి సంబంధించిన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో మహారాష్ట్ర తెలంగాణలో మీదుగా వాహనాల రాకపోకలను కూడా నిలిపి వేయడంతో వయ మహాదేవపూర్ కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన పై నుండి మహారాష్ట్రలోకి ప్రయాణం సాగిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Post A Comment: