ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
వరంగల్ తూర్పు నియోజకవర్గ యువత అంత బిఆర్ఎస్ వైపు ఉన్నారని కేసీఆర్ చేసిన అభివృద్ధి ఆకర్షితులై నేడు 18వ డివిజన్ చెందిన బీజేపీ యుత్ నాయకులు వస్కుల అజయ్ వారి మిత్ర బృందం జన్ను శ్రవణ్, భుషపాక రంజిత్,జన్ను సందీప్ నేడు ఏఎస్ఎం కళాశాల వద్ద నున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా వారికి గులాబీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
వరంగల్ తూర్పు నియోజకవర్గాన తాము చేసిన అభివృద్ధికి కేసీఆర్ నాయకత్వన నడవాలని వారు బిఆర్ఎస్ పార్టీలో చేరడం జరిగిందని.
అన్ని వర్గాల ప్రజలను గొప్పగా ఆదుకుని ప్రజలకు గొప్పగా కాపాడుకోవడం జరుగుతుందని.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీలో చేరిన వస్కుల అజయ్ మరియు వారి మిత్ర బృందం మాట్లాడుతూ
బీజేపీ తెలంగాణ పట్ల అవలభించిన తీరు వరంగల్ తూర్పు నియోజకవర్గానా బీజేపీ నాయకత్వంపై నమ్మకం లేక ఎమ్మెల్యే నరేందర్ అభివృద్ధి ఆకర్షితులై నేడు ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరడం జరిగిందని వారు తెలిపారు.
మునుముందు ఎమ్మెల్యే గెలుపుకి కృషి చేసి తూర్పున గులాబీ జెండా ఎగరేస్తామని వారు తెలిపారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ వస్కుల బాబు, కొమ్ముల సుధాకర్, ముఖ్య నాయకులు హాజరయ్యారు.

Post A Comment: