మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న బీజేపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ స్థానిక పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప స్వామి చౌరస్తాలో BJYM అధ్వర్యంలో రాస్తా రోకో నిర్వహించి అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి వినతి పత్రాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బద్రి దేవేందర్,
ప్రధాన కార్యదర్శి శివంగారి సతీష్ కుమార్,
బీజేపీ మండల అధ్యక్షడు పర్స సమ్మయ్య మాట్లాడుతూ.
నష్ట పోయిన అభ్యర్థుల పక్షాన పోరాటం చేస్తున్నా BJYM రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాష్ పై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన కేసీఆర్ ప్రభుత్వన్ని గద్దె దించే వరకు BJYM పోరాటాలు చేస్తూనే ఉంటుంది అన్నారు.
నిన్న బీజేపీ రాష్ట్ర అ్యక్షుడు బండి సంజయ్ గారు గన్ పార్కు వద్ద శాంతియుతంగా నిరసన చేస్తున్న క్రమంలో ఆయనను కూడా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ తరలించడం పై పోలీసులు తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
TSPSC సంస్థ ద్వారా నిర్వహించాల్సిన గ్రూప్ 1 టౌన్ ప్లానింగ్ పరీక్ష పత్రాలు లీక్ అవడం ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని అద్దం పడుతుంది అన్నారు.
పేపర్ లీక్ అయి నష్ట పోయిన అభ్యర్థులకు లక్ష రూపాయల నష్టరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ. లీకేజీ లో ప్రధాన సూత్రధారి అయిన చైర్మన్ ను బర్తరఫ్ చేయాలని కోరారు.
ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి బాధ్యత వహిస్తూ మంత్రి కెటిఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో. ముస్త్యాల సంతోష్, పల్లె సదానదం, వెల్లంపల్లి శ్రీనివాస్,జంగా చక్రధర్, తుడి రవీందర్, ఎండీ పహిం,పన్నల లక్ష్మన్, కర్రే రాజు, రమేష్,విజయ్,సందీప్ వేణు గౌడ్,అఖిల్,రాకేశ్, వెంకటేష్ రావ్, మల్లారెడ్డి, రాజేశం, తదితరులు పాల్గొన్నారు...

Post A Comment: