మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
అకాల వర్షానికి నష్టపోయిన రైతులను వెంటనే
ప్రభుత్వం ఆదుకోవాలి.
అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం జిల్లా అధ్యక్షులు
గుమ్మడి వెంకన్న అధ్యక్షులు డిమాండ్ చేశారు,
స్థానిక ఎక్లాస్పూర్ గ్రామంలో
అఖిలభారత ప్రగతిశీల రైతు సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశంలో గుమ్మడి వెంకన్న మాట్లాడుతూ
అకాల వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల నుండి వర్షాలు కురవడం వలన మామిడి, వరి మిర్చి, మొక్కజొన్న, కూరగాయ రైతులు తీవ్రంగా నష్టపోయారు వారిని వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాము ,
లేనియెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం,
రైతులు అనేక కష్టనష్టాలతోటి పంటలు పండిస్తే వారిని ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. నిరంతరం ఎరువుల ధరలు పెంచుతూ నకిలీ విత్తనాలు అరికట్టడం కుండా, పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా రైతుల నష్టాల్లోకి వెళుతున్నారు, మరియు
అకాల వర్షం వలన ఇంకా ఎక్కువ నష్టపోతున్నారు పెట్టిన పెట్టుబడి రాక అప్పులతో కొట్టుమిట్టాడుతున్నారు
ఇంటిపై పడుతున్నారు, మానసిక ఇబ్బందులకు గురవుతున్నారు,
కావున వెంటనే అకాల వర్షం లో నష్టపోయిన పంటలు అన్నిటి పైన సర్వే చేసి తగిన నష్టపరిహారం చెల్లిస్తూ ప్రభుత్వ రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాం
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు తీగుట్ల రాములు, గోర్క శ్రీనివాస్ కనకయ్య శ్రావన్ సాయి శ్రీనివాస్ దేవేందర్ మల్లన్న
లు పాల్గోన్నొరు

Post A Comment: